సినీ ఇండస్ట్రీలో వరుసగా కమర్షియల్ సినిమాలనే రూపొందించి సక్సెస్‌లు అందుకనే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో అనిల్ రావిపూడి పేరు మొదటి వరుసలో వినిపిస్తుంది. ఇప్పటివరకు సక్సెస్ తప్ప.. ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడిగా రాజమౌళి నెంబర్ 1 పొజిషన్లో రాణిస్తున్నాడు. ఇప్పటివరకు జక్కన 12 సినిమాలను తెరకెక్కించే.. 12 సినిమాలు తో సక్సెస్ అందుకుంటే అనిల్ రావిపూడి.. ఎనిమిది సినిమాలు తెరకెక్కించి అన్ని సినిమాలతో హిట్ కొట్టి ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడిగా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మల్టీ స్టార్లర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
గతంలో మల్టీ స్టారర్ సినిమాలకు స్టార్ హీరోలు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ.. రాజమౌళి ఎప్పుడైతే త్రిబుల్ ఆర్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు.. అప్పటినుంచి మల్టీస్టారర్ల ట్రెండ్ ప్రారంభమైంది. మంచి కంటెంట్ ఉంటే స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్లలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే చిరుతో మెగా 157 పనులో బిజీగా గడుపుతున్న అనీల్.. నెక్స్ట్.. ఓ బిగ్గెస్ట్ క్రేజీ మల్టీ స్టార్ కు ప్లాన్ చేస్తున్నాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. వెంకీ – నాగ్ కాంబోలో మూవీ తెరకెక్కించాలని భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే ఎప్పుడు కామెడీ సినిమాలు తో ఆడియన్స్ ని ఆకట్టుకునే అనిల్.. ఈ సినిమాను సైతం కామెడీ జానర్‌లోనే రూపొందించనున్నాడని టాక్ వైరల్ గా మారుతుంది. ఇక ఇప్పటికే అనిల్ రావిపూడి సీనియర్ స్టార్ హీరోలు బాలయ్య, వెంకటేష్ లతో సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
చిరు తోను సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే నిజంగా వెంకీ – నాగ్ కాంబోలో అనిల్ రావిపూడి సినిమా వర్కౌట్ అయితే మాత్రం.. ఇప్పటివరకు సీనియర్ స్టార్ హీరోలు నలుగురితోను సినిమాలు తెరకెక్కించిన ఏకైక డైరెక్టర్ గా అనిల్ రావిపూడి రికార్డ్ క్రియేట్ చేస్తాడు. దాదాపు 35 ఏళ్ల నుంచి వెంకటేష్ – నాగార్జున కాంబోలో ఒక్క మల్టీస్టారర్ సినిమా కూడా తెరకెక్కలేదు. అయితే ఎంతమంది దర్శకులు వీళ్ళ కాంబోలో సినిమా చేయాలని ప్రయత్నాలు చేసినా అవి వర్కౌట్ కాలేదు. తాజాగా అనిల్ రావిపూడి వీళ్లిద్దరూ కాంబోలో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు అంటూ టాక్ వైరల్ అవ్వడంతో.. అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా సెట్స్ పైకి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఇక అనీల్ వీళ్ళిద్దరి కాంబోలో సినిమాను తెరకెక్కించి సీనియర్ హీరోలు నలుగురితో సినిమా చేసిన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడో.. లేదో.. వేచి చూడాలి.