నిన్న ప్రపంచ అంతర్జాతీయ డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రాండ్ లెవెల్ లో ఏర్పాటు చేసింది. ఇందులో చరణ్, విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్లుగా హాజరయ్యారు. మాదకద్రవ్యాల నివారణ పోరాటం అందరూ కలిసి నిలబడాలని.. వాటిని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సైనికుడిగా మారాలంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అందరూ స్పీచ్‌లు ముగిసిన తర్వాత.. చివర్లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రమాణం చేస్తున్న నేపథ్యంలో.. చరణ్ కొద్దిగా అసౌకర్యంగా ఫీల్ అవడం వీడియోలో క్లియర్గా అర్థం అవుతుంది.
ముఖ్యంగా ఆయన చేతికి ఏదో గాయమైనట్లు కట్టుతో కనిపించారు.. ఈ క్రమంలోనే చరణ్ కు ఏం జరిగిందో అనే ఆందోళనలో ఫ్యాన్స్ మునిగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెటింట వైరల్ అవ్వడంతో.. అసలు చరణ్ కు బ్యాండేజ్ ఎందుకు ఉంది.. అసలు ఆయనకి ఏం జరిగింది.. అనే సందేహాలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పెద్ది సినిమా షూట్ టైంలో చరణ్ కు గాయమైందట. అది స్వల్ప గాయం కావడంతో బయటకు రివిల్ కాలేదని టాక్. ఇందులో వాస్తవం ఎంతో అఫీషియల్ గా క్లారిటీ ఇస్తే కానీ తెలియదు. ఇక చివరిగా.. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోకపోవడంతో నిరాశకు గురైన ఫ్యాన్స్.. పెద్ది సినిమాతో చరణ్ ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆరాటడుతున్నారు.
చరణ్ సైతం ఈ సినిమాతో సక్సెస్ అందుకుని.. ఆడియన్స్‌కు ఫుల్ మీల్ పెట్టాలనే కసితో కష్టపడుతున్నాడు. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సన్న డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో.. జాన్వికాపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలకపాత్రలో మెరవనున్నాడు. బాలీవుడ్ నటుడు దివ్యంద్రు సైతం స్పెషల్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ ఆడియోస్లో మంచి రెస్పాన్స్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా రంగస్థలంను మించిపోయే రేంజ్‌లో హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.