పవన్ సినిమాకు బయ్యర్లే దొరకట్లేదా.. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు..!

గత కొద్దిరోజుల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులంతా.. కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఎట్టకేలకు షూటింగ్‌లు పూర్తిచేసుకుని.. జూన్ 12న రిలీజ్ సిద్దమైన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో సినిమా విఎఫ్ఎక్స్‌ కాకపోవడంతో.. మరోసారి సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందంటూ టాక్‌ నడుస్తుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త తెగ వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమాను ప్రారంభించి ఐదేళ్లు అవుతున్న క్రమంలో.. నిర్మాతకు వచ్చిన భారీ నష్టాన్ని ఎంతో కొంత పూడ్చేందుకు పవన్ తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసాడని టాక్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

ఇలాంటి క్రమంలో వీరమల్లు సినిమాకు నెగిటివిటీని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు.. యాంటీ ఫ్యాన్స్. వీరమల్లు సినిమాకు అసలు బిజినెసే లేదని.. బయ్యర్లు కూడా రావడం లేదని.. కొనడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదని.. టాక్ తెగ వైరల్ గా మారుతుంది. అయితే డిప్యూటీ సీఎం గా విధులు నిర్వహిస్తున్న పవన్ లాంటి స్టార్ హీరోకు ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అందరికీ షాక్‌ను కలిగిస్తుంది. ముఖ్యంగా అభిమానులకు ఇది తీవ్ర నిరాశను కలిగిస్తుంది. అయితే.. తాజాగా వినిపించినా ఈ రూమర్లపై మూవీ టీం రియాక్ట్ అవుతూ స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. వీరమల్లు సినిమా బిజినెస్‌పై వస్తున్న వార్తలను ఖండిస్తూ.. అసలు పవన్ సినిమాకు బయ్యర్లు దొరకకపోవడం ఏంటి.. ఈ విషయాన్ని కొంతమంది నమ్మడం ఏంటి..? చాలా కామెడీగా ఉంది అంటూ తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పవన్ అంటే ఒక బ్రాండ్.. అలాంటి బ్రాండ్ కి బయ్య‌ర్లు దొరకక‌పోవడం ఏంటి.. ఇది కావాలని స్వార్థ ప్రయోజనాల కోసం స్ప్రెడ్ చేస్తున్న రూమర్లు అంటూ మూవీ టీం వివరించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం వెనుక ఎవరికి ప్రయోజనం ఉంటుందో.. ఆ దేవుడికే తెలియాలి.. అంటూ షేర్ చేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ వీరమల్లు. ఇందులో పవన్ చారిత్రక యోధుడిగా మరువనున్నారు. భారీ బడ్జెట్ తో 2020లో ప్రారంభించిన ఈ సినిమా.. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. మరి రెండో భాగం రిలీజ్ కావడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో వేచి చూడాలి.