నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తావన వచ్చినప్పుడు అయన కోపిష్టని.. అతనికి స్నేహితులు ఎవరూ ఉండరని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఎన్టీఆర్ సన్నిహితులు మాత్రం బాలకృష్ణది చిన్న పిల్లల మనస్తత్వం అని.. ఎవరైనా తప్పు చేస్తే మొఖం పైనే మాట్లాడేస్తాడు.. వాళ్ళు ఎంతటి వారైనా సరే తన కోపాన్ని వెంటనే ప్రదర్శిస్తాడని.. ఈ క్రమంలోనే అతనిని కోపిష్ట్ అంటూ ఉంటారు. కానీ.. ఆయన చాలా మంచి వ్యక్తి అని.. సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా బాలకృష్ణ కోపానికి సంబంధించిన మరో న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. గతంలో బాలకృష్ణ ఓ డైరెక్టర్ చేసిన పనికి కోపంతో ఊగిపోయాడట. ఈ రీల్ మొత్తం తగలెట్టేస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. ఇంతకీ బాలయ్యకు అంతలా కోపం తెచ్చిన వ్యక్తి ఎవరు.. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం.
నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్.. శ్రీనాథకవి సార్వభౌమ మూవీ షూటింగ్.. రామకృష్ణ స్టూడియోస్ లో జరుగుతున్న రోజుల్లో తండ్రి సినిమా కావడం.. అందులోనూ హిస్టారికల్ మూవీ కావడంతో బాలయ్య షూటింగ్ చూసేందుకు ఆసక్తి చూపేవాడట. వీలున్నప్పుడల్లా సెట్స్ కు వెళ్లేవాడట. అదే స్టూడియోలో జంతర్ మంతర్ అని మరో మూవీ షూట్ జరుగుతుంది. ఒకరోజు సాయంత్రం తండ్రి సినిమా షూట్ చూడడానికి వెళ్ళిన బాలయ్య.. జంతర్ మంతర్ షూటింగ్ జరుగుతున్న సెట్స్ పక్కనుంచి వెళ్ళాడట. ఆ సెట్స్‌లో ఓ చిన్న కుర్రాడు షూట్ కోసం లైట్ పట్టుకొని కనిపించాడు. ఎంతసేపటి నుంచి పట్టుకుని ఉన్నాడో తెలియదు. కానీ.. బరువు మోయలేక అలసిపోయి కళ్ళు తిరిగి పడిపోయేలా బాలయ్యకు అనిపించిందట. షార్ట్ మధ్యలో ఉంది. వెంటనే.. బాలయ్య వేగంగా కుర్రాడి దగ్గరికి వెళ్లి.. పడిపోతున్న అతని పట్టుకొని పక్కన కూర్చోపెట్టి.. షార్ట్ పూర్తయ్యే వరకు బాలయ్య లైట్ పట్టుకొని నుంచున్నాడట. ఇది గమనించిన ఆ సినిమా డైరెక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి.. లైట్ చేతిలోకి తీసుకుని షూట్ ను పూర్తి చేశాడు.
ఆ షాట్ పూర్తయిన వెంటనే.. ఆగ్రహంతో బాలయ్య డైరెక్టర్ ను అరిచేసాడట. పసి పిల్లలతో ఏంట్రా ఇది.. రీల్ తగలబెట్టేస్తా అని తిట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. పొద్దున్నుంచి ఏమీ తినకపోవడంతో బక్క చిక్కి నీరసంగా ఉన్న ఆ అబ్బాయిని తీసుకెళ్లి కడుపునిండా అన్నం పెట్టండి.. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులను తీసుకుని రండి అంటూ స్టూడియో సిబ్బందితో వివరించాడట. ఒక అరగంటలో ఆ కుర్రాడితో స్టూడియో మేనేజర్ తిరిగి వచ్చాడు. ఆ కుర్రాడి తండ్రి పక్షవాతం, తల్లి మూర్ఛ రోగంతో మంచాన పడ్డారని తెలుసుకున్న బాలయ్య హృదయం చలించిపోయింది. వెంటనే తార్నాక్‌లోని హాస్పటల్లో వాళ్లను చేర్పించమని.. వైద్యానికి అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తానని వివరించాడట. ఆ కుర్రాడిని కూడా తార్నాక్ లోని సరస్వతి శిశు మందిర్లో చేర్పించి.. చదువు పూర్తయ్య వరకు ఖర్చులు కూడా ఆయనే భరించాడట. కష్టపడి చదువుకున్న ఆ కుర్రాడు.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ బంకుర జిల్లాలో సీఐగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు.. ఆయన కోపిష్టి అనే వాళ్ళందరికీ ఇదే సరైన సమాధానం అంటూ.. మా బాలయ్య మనస్సు వెన్న అంటూ తెగ వైరల్ చేస్తున్నారు.