ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓ సినిమాను తెరకెక్కించి 100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడం అంటే అది చాలా చిన్న విషయం. కానీ.. గతంలో మాత్రం సినిమాకు రూ.100 కోట్లు వసూలు వచ్చాయంటే అదో పెద్ద అద్భుతం. సంచలనం. చాలా చాలా గొప్ప విషయం. మనదేశంలో అది ప్రపంచంలోనే ఎనిమిదో వింతలా అంతా భావించేవారు. ఎంతో అరుదుగా ఇలాంటి రికార్డులు క్రియేట్ అయ్యేవి. అయితే మెల్లమెల్లగా రూ.100 కోట్లు వసూలు చేయడం అనేది చాలా కామన్ గా మారిపోయింది. మొదటి రెండు వారాలు టికెట్ ధరల పెంపు అలాగే.. అన్ని థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో.. యావరేజ్ టాక్ వచ్చినా సరే.. ఆ సినిమాకు సులువుగా రూ.100 కోట్ల వసూలు వచ్చేస్తున్నాయి.
ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలకైతే.. ఫస్ట్ డేనే రూ.100 నుంచి రూ.200 కోట్ల వరకు కలెక్షన్లు అందుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే.. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏకంగా 18సార్లు రూ.100 కోట్లు కలెక్షన్లు కల్లగొట్టిన ఏకైక హీరో అతనే అంటే న్యూస్ వైరల్ గా మారుతుంది. అతనెవరో కాదు. బాలీవుడ్ భజరంగీ భాయిజాన్.. సల్మాన్ ఖాన్. ప్రస్తుతం తన సినిమాల విషయంలో అందరూ హీరోల కంటే ముందు వరుసలో రాణిస్తున్నాడు. అలా ఇప్పటికే 18 సినిమాలతో రూ.100 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టాడు. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న మరే హీరోకు ఈ రికార్డు సాధ్యం కాలేదు.
ఇప్పటికి.. ఎంతో మంది రికార్డును బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారట. దబాంగ్, రెడీ, బాడీగార్డ్, దబాంగ్ 2, జై హో, కిక్, ఏక్తా టైగర్, భజరంగీ భాయిజాన్, సుల్తాన్, ట్యూబ్ లైట్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, భారత్, టైగర్ జిందా హై, టైగర్ 3, కిసికా బై కిసికి జాన్, సికిందర్ ఇలా అన్ని సినిమాలతోనూ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా 100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టాడు. ఇక తాజాగా రిలీజ్ అయిన సికిందర్ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. రూ.100 కోట్లు మాత్రం సులువుగా దాటేశాడు సల్మాన్. సోలో హీరో గానే ఇవన్నీ దక్కించుకోవడం విశేషం. ఒకరకంగా భవిష్యత్తులో కూడా మరే హీరో ఈ రికార్డును బ్రేక్ చేయడం అంత శులువు కాదనడంలో అతిశయోక్తి లేదు.