తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు వరుస సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది భారీ బ్లాక్ పాస్టర్ సక్సెస్ లో అందుకుంటూ మంచి ఫామ్ లో దూసుకుపోతుంటే.. మరికొందరు మాత్రం భారీ డిజాస్టర్ లను మూటగంటుకుంటూ నిర్మతలకు నష్టాలను తెచ్చి పెడుతున్నారు. అలా ఇప్పటివరకు కోటి నుంచి రూ.70 కోట్ల వరకు నష్టాలు అందుకున్న స్టార్ హీరోల సినిమాల లిస్టు ఏంటో ఒకసారి చూద్దాం. సీనియర్ స్టార్ హీరో చిరంజీవి నటించిన ‘ ఆపద్బాంధవుడు ‘.. డిజాస్టర్. ఈ సినిమాతో పాటు.. నాగార్జున నటించిన ‘ అంతం ‘ మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచి అప్పట్లోనే మేకర్స్‌కు కోటి రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఇక బాలయ్య హీరోగా నటించిన ‘ నిప్పురవ్వ ‘ .. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఏకంగా రూ.2 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది.
ఇక చిరంజీవి మరో మూవీ ‘ బిగ్ బాస్ ‘. బాపినీడు డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా.. ఆడియన్స్ లో భారీ క్రేజ్ దక్కించుకుంది. అయితే రిలీజ్ తర్వాత ఈ సినిమా ఏకంగా రూ.4 కోట్ల భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇక నాగార్జున హీరోగా మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ ‘ రాక్షసుడు ‘ సినిమాకు.. ఏకంగా రూ.8 కోట్ల లాస్ వచ్చింది. చిరంజీవి ‘ మృగరాజు ‘ సినిమా రిలీజై డిజాస్టర్ కావడంతో.. ఈ సినిమాకు నిర్మాతలు రూ.10 కోట్ల నష్టాన్ని చెవిచూడాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘ కాటమరాయుడు ‘ సినిమా ఏకంగా రూ. 10 కోట్ల వరకు నష్టం మిగిల్చింది. ఇక బాలకృష్ణ, బి.గోపాల్ కాంబోలో ‘ పలనాటి బ్రహ్మనాయుడు ‘.. రూ.22 కోట్ల ప్రీ రిలీజ్ జరుపుకున్న ఈ సినిమా.. రూ.17 కోట్లు నష్టాన్ని చూసింది. ఎన్టీఆర్ ‘ ఆంధ్రావాలా ‘ సినిమాకు రూ.25 కోట్ల నష్టం రాగా.. బాలయ్య ‘ ఒక్క మగాడు ‘ సినిమాకు రూ.17 కోట్లు నష్టం వచ్చింది.
తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘ కొమరంపులి ‘ ఏకంగా రూ.22 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. మహేష్ బాబు ‘ ఖలేజా ‘కు సైతం ఇదే రేంజ్ లో నష్టాలు వచ్చాయి. దాదాపు రూ.20 కోట్ల వరకు నష్టం జరిగింది. ఇక ఎన్టీఆర్ నటించిన ‘ శక్తి ‘ సినిమా ఏకంగా రూ.36 కోట్ల నష్టాన్ని చూసింది. మహేష్ బాబు ‘ వన్ నేనొక్కడినే ‘ రూ.40 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. ‘ సర్దార్ గబ్బర్ సింగ్ ‘ సైతం రూ.40 కోట్ల నష్టం వచ్చింది. మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో ‘ బ్రహ్మోత్సవం ‘ సినిమాకు మరింతగా నష్టపోయారు మేకర్స్. ఏకంగా రూ.50 కోట్ల నష్టం వచ్చింది. పవన్ కళ్యాణ్ ‘ అజ్ఞాతవాసి ‘ రూ.70 కోట్ల నష్టాలు తెచ్చిపెట్టింది. ఇక రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ వినయ విధేయ రామ ‘ ఏకంగా రూ.200 కోట్ల లాస్ ని తెచ్చి పెట్టింది.