ఏకంగా 72 సాంగ్స్ రిలీజై రికార్డు క్రియేట్ చేసిన ఏకైక మూవీ.. ఏదో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఏ సినిమా రూపొందించినా.. ప్రతి సినిమాలోని పాటలకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులోను బాలీవుడ్ సినిమాల్లో పాటలకు ఎలాంటి ఇమేజ్ ఉంటుందో తెలిసిందే. కథలో భాగంగానే ఇంట్రెస్టింగ్గా పాటలను డిజైన్ చేస్తూ ఉంటారు. బ్రేకప్, ప్రేమ కథలు ఇలా అన్ని పాటలోనే వివరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే క్యాస్టింగ్ అంతా ఫిక్సయిన తర్వాత.. మొదట ఆలోచించే విషయం పాటలు ఎవరు పాడుతారు.. ఎక్కడ రూపొందిస్తారు.. ఎప్పుడు ఏ పాట వస్తుందని ఎంతో ప్లానింగ్ తో నిర్ణయిస్తారు. ఇక కొన్ని సినిమాలకు కేవలం సాంగ్స్ వల్లే ఆడియన్స్ థియేటర్లకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే ఒకే ఒక సినిమా ఏకంగా 72 సాంగ్‌ల‌తో రిలీజై సినీ ఇండస్ట్రీలోనే రికార్డును క్రియేట్ చేసింది.

Indrasabha (1932) - IMDb

ఇప్పటివరకు కూడా ఆ సినిమా రికార్డును ఎవరు కనీసం టచ్ కూడా చేయలేకపోయారు. అయితే అదిగో బాలీవుడ్ సినిమా ఎక్కువ పాటలున్న మొట్టమొదటి హిందీ సినిమా కూడా అదే. చాలా ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా 3 గంటల 30 నిమిషాలు అడిగితే రిలీజ్ అయింది. ఆ మూవీ ఏదో కాదు 1932లో రిలీజ్ అయిన ఇంద్రసభ. బాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత యుగానికి నాంది పలికిన మూవీ ఇదే అంటారు. ఇక ఇంద్రసభ టైటిల్‌తో బాలీవుడ్ లో రెండు సినిమాలు రిలీజ్ కాగా మొదటిది మనీలాల్ జోషి దర్శకత్వంలో 1925లో మక్కీ మూవీ. రెండవది 1932లో 72 పాటలతో వచ్చిన టాకీ మూవీ. ఇందులో ఏకంగా 15 నార్మల్ సాంగ్స్ ఉంటే, 9 తుమ్మరీలు, 4 హోలీ సాంగ్స్, 31 గజాల, 2 చౌగోళాల, 5 చాంద్‌లు, 5 ఇతర సాంగ్స్ ఉన్నాయి. ఇలా మొత్తంగా 72 సాంగ్స్ పై సినిమాను డిజైన్ చేశారు.

93 Years Old Movie Indrasabha Has Record of 72 Songs No One Has Been Able To Break It Till Date All Of Them Were Hit | 93 साल पुरानी वो फिल्म, जिसके

ఇక ఈ స్టోరీ ఓ దయగల న్యాయవంతుడైన రాజు ఉద్దేశిస్తూ.. ప్రజలను ప్రేమిస్తూ అందరికీ సహాయం చేసే రాజు కీర్తి స్వర్గానికి చేరుకుంది. ఇంద్రసభలోని అప్సర ఒక ఆమె.. ఈ రాజును పరీక్షించడానికి భూమికి చేరి.. రాజు గుణగణాలు చూస్తూ అతనిపై ప్రభావితరాలై.. ఆయన్ను ప్రేమిస్తుంది. ఇక ఈ సినిమాలో జాహ్నర్ కార్జన్, మాస్టర్ నిస్సార్ ప్రధాన పాత్రలో నటించారు. జాహ్నర్ నటిగానే కాదు.. మంచి గాయని కూడా. ఆమె బెంగాల్ నైటింగేల్‌గా క్రేజ్‌ను సంపాదించుకున్నారు. అయితే.. 30 ఏళ్ల చిన్న వయసులోనే ఆమె మరణించడం బాధాకరం. కాగా.. ఈ సినిమాలో 72 సాంగ్స్ ఇప్పటివరకు ఏ సినిమా కూడా కనీసం టచ్ చేయలేకపోయింది. ఈ సినిమాల్లో హైయెస్ట్ పాటలున్న నేపథ్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును 1980లో మూవీ సొంతం చేస్తుంది.