టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. పేరు చెప్తే ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్ మొదలైపోతాయి. ఇప్పటివరకు తన నుంచి వచ్చిన ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సంచలనం అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఆయన తెరకెక్కించనున్న నెక్స్ట్ మూవీ స్పిరిట్. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా కోసం.. ఆయన తీసుకునే ప్రతి ఒక్క డెసిషన్ అంచనాలను మరింతగా పెంచుతూ వస్తుంది. అయితే మొదట్లో ఈ సినిమా హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తుందని తెలియడంతో సినిమాపై ఆడియన్స్ లు పిక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి.
తర్వాత జరిగిన ఈష్యూస్.. రెమ్యునరేషను భారీగా డిమాండ్ చేయడంతో దీపికను తప్పించి ఆ ప్లేస్ లో తృప్తి దిమ్రిని సందీప్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసి అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దీపిక తన పిఆర్టీంతో స్పిరిట్ సినిమా స్టోరీ మొత్తం లీక్ చేయించడం.. సందీప్ రెడ్డి దానికి తగ్గట్టు స్ట్రాంగ్ ట్విట్ చేయడం.. వెంటనే దీపిక దానికి కౌంటర్ ఇవ్వడం.. ఇలా దీపికా వర్సెస్ సందీప్ వార్ ఎంత హాట్ టాపిక్ గా మారిందో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో మరో న్యూస్ నెటింట వైరల్ గా మారుతుంది. సందీప్ రెడ్డివంగా డైరెక్షన్లో రూపొందుతున్న ఈ స్పిరిట్ సినిమాల్లో మరో సెన్సేషనల్ బ్యూటీ సెకండ్ హీరోయిన్ గా నటించబోతుందట.
ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఓ క్రేజీ ఫిగర్‌ను సందీప్ ఫిక్స్ చేశాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. మృణాల్ ఠాగూర్. ఈ సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా నటించేందుకు మృణాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. వాస్తవానికి.. మృణాల్ రొమాంటిక్ సన్నివేశాలలో నటించేందుకు అసలు ఒప్పుకోదు. ఈ క్రమంలోనే ఎన్నో మంచి సినిమాలను కూడా రిజెక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి బోల్డ్ సినిమాలతో పాపులారిటి దక్కించుకున్న సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో.. సినిమాకు అసలు గ్రీన్ సిగ్నల్ ఎలా ఇచ్చింది.. ఆమెను ఎలా ఒప్పించాడు.. అనే సందేహాలు ప్రస్తుతం నెటింట చర్చినీయ అంశంగా మారాయి. ఇంతకీ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మృణాల్ నటిస్తుందా.. లేదా.. ఈ వార్తలో వాస్తవం ఎంతుందో తెలియాలంటే అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.