సందీప్ రెడ్డి వర్సెస్ దీపికా: ఆమెకు సపోర్ట్ గా తమన్నా.. అసలు మ్యాటర్ ఇదే..

గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటి దీపిక పదుకొనే పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ వర్సెస్ దీపికా పదుకొనే వార్ కొనసాగుతున్న నేపథ్యంలో.. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ పోస్ట్ త‌మ‌న్నా లైక్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంలో దీపికకు.. తమన్నా సపోర్ట్ చేస్తుందంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. దీనిపై మిల్కీ బ్యూటీ తమన్న తాజాగా రియాక్ట్ అయింది. తన ఇన్స్టా స్టోరీలో ఆమె దీనిపై క్లారిటీ ఇచ్చింది.

Sandeep Reddy Vanga Blasts Deepika Padukone: “Putting Down Younger Actress  & Revealing My Script – Is This Your Feminism?”

ఇక తనకు తానుగా పోస్టులను ఇన్స్టాగ్రామ్ ఎలా లైక్ చేస్తుందో చెబితే బాగుంటుందని.. ఈ విషయం తెలియని కొందరు దీన్ని పెద్ద వార్తల ప్రచారం చేస్తున్నారని.. త‌మ‌న్న స్టోరీలో రాసుకొచ్చింది. నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ ను తమన్నా కావాలని లైక్ చేయలేదని అందరికీ క్లారిటీ వచ్చింది. ఈ గందరగోళానికి కారణం దీపికకు చెందిన ఓ పాత వీడియో అని తెలుస్తుంది. తాజాగా ఓ అభిమాని ఆ విడియోను షేర్ చేసుకోవడమే దానికి కార‌ణం. ఇక దీపిక ఆ వీడియోలో.. ఆమె ఓవర్ టైం పనిచేయడం, ప్రపంచంలో ఉన్న లింగ అసమానతలతో పాటు.. మరికొన్ని విషయాల గురించి తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది.

Deepika Padukone Sandeep Vanga Reddy Spirit Controversy Tamannaah Bhatia  Clears She Did Not Support Actress 'स्पिरिट' विवाद में दीपिका को सपोर्ट कर  रहीं तमन्ना? एक्ट्रेस ने क्या कहा, Bollywood ...

ఈ పోస్ట్‌కు తమన్నా లైక్ కొట్టినట్లు ఆ అభిమాని ఓ స్క్రీన్ షాట్ ను ఇటీవల షేర్ చేశారు. దీంతో.. ఆమెకు తమన్నా సపోర్ట్ చేస్తుంది అంటూ వార్తలు తెగ వైరల్ గా మారాయి. అయితే.. ఆ పోస్ట్‌ను తమన్న లైక్ చేయ‌లేద‌ని తెలిపోయింది. తన సినిమాను లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్స్.. దీపికను ఉద్దేశించే అంటూ నెటిజ‌న్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి నేపథ్యంలో తమన్నా.. ఆమెకు సంబంధించిన పోస్ట్ లైక్ చేయడం హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక తమన్నా ఇచ్చిన క్లారిటీతో అయినా ఈ వార్తలకు చెక్ పడుతుందేమో చూడాలి.