టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి పాపులారిటీతో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే చేతినిండా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న తారక్.. మరో 3 రోజుల్లో బర్త్‌డే నే సెలబ్రేట్ చేసుకోనున్నాడు. ఈ క్రమంలోనే తారక్ బర్త్‌డే పై ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొంది. ఇప్పటికే ఎన్టీఆర్ బర్త్‌డే రోజున కొన్ని కొత్త ప్రాజెక్టుల అనౌన్స్మెంట్లు రానున్నాయని.. ఇప్పటికే అనౌన్స్ చేసిన సినిమాల నుంచి క్రేజీ అప్డేట్స్ రివిల్ చేయనున్నారు అంటూ వార్తలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఇక వీటన్నింటిలో ప్రస్తుతం తారక్ చేస్తున్న ప్రశాంత్ నీల్ మూవీ పై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ క్రమంలోనే సినిమా నుంచి ఏదైనా చిన్న అప్డేట్ వస్తే బాగుండని అభిమానులంతా ఎంతగానో ఆశపడుతున్నారు. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఏన్టీఆర్, నీల్ ప్రాజెక్ట్ నుంచి ఈసారి ఎలాంటి అప్డేట్ రావడం లేదట. కేవలం పుట్టినరోజు విషెస్ తో పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఓ భారీ వీడియో, టైటిల్ అనౌన్స్మెంట్ ఇలాంటివి ప్రాజెక్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకపోవడమే మంచిది. నిజానికి ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్ లో భాగంగా డ్రాగన్ టైటిల్ వీడియో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట. పనులు కూడా ప్రారంభించిన తర్వాత హృతిక్ రోషన్ వేసిన వార్ 2 ట్విట్ తో.. నీల్ వెనక్కు తగ్గాడని తెలుస్తుంది.
ఇక హృతిక్ రోషన్ తన ట్విట్టర్ వేదికగా.. ఈసారి ఎన్టీఆర్ సైతం ఆశ్చర్యపరిచే రేంజ్లో వార్2 నుంచి ఓ స్పెషల్ వీడియో రిలీజ్ కానుంది అంటూ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వార్ 2 పై.. ఫ్యాన్స్‌లో ఉన్న ఆసక్తిని మరోవైపుకు మరల్చడం ఇష్టంలేని నీల్.. తన టైటిల్ అనౌన్స్మెంట్ వాయిదా వేసుకున్నట్లు సమాచారం. పైగా.. డ్రాగన్ సినిమా ప్రమోషన్స్‌కు కావాల్సినంత టైం కూడా ఉండనే ఉంది. వచ్చే ఏడాది జూన్‌లో ఈ సినిమా ధియేటర్లలోకి రానుంది. కనుక.. వార్ 2 సినిమాకు సరైన స్పేస్ ఇవ్వడమే కరెక్ట్ అని నీల్ భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే డ్రాగన్ అప్డేట్స్ ఏమి.. తారక్ బర్త్‌డే రోజు రిలీజ్ అయ్యో ఛాన్స్ లేదు.