రూ. 5 కోట్లతో ప్రభాస్ సడన్ ఫారిన్ ట్రిప్.. కారణం అదేనా..!

ఒకప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే బాలీవుడ్ నెంబర్ వన్‌గా కొనసాగుతూ ఉండేది. ఈ క్రమంలోనే అక్కడ హీరోస్ అంతా మమ్మల్ని టచ్ చేసే వాళ్లు ఇండస్ట్రీలోనే లేరు అని.. తల పొగరుని చూపిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో ప్రభాస్ బాహుబలితో.. పాన్‌ ఇండియన్ ఆడియన్స్‌ని పలకరించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో దెబ్బకు బాలీవుడ్ హీరోల క్రేజ్ మొత్తం పడిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్‌లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. తెలుగు సినీ ఖ్యాతిని మరింత పెంచాడు రెబల్ స్టార్. మొదట ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆయన.. తన తర్వాత ప్రాజెక్ట్ లతో వ‌రుస‌గా పాన్ ఇండియ‌న్‌ కంటెంట్‌లు ఎంచుకుంటూ సూపర్ సక్సెస్‌లు అందుకుంటూ వచ్చాడు.

Prabhas' The Raja Saab To Have Remake Of A Popular Hindi Song - News18

ఈ క్రమంలోనే చిన్న హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. టాలీవుడ్ రెబల్ స్టార్ రేంజ్‌కు ఎదిగాడు. తర్వాత బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియ‌న్‌ స్టార్‌గా మారిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ ఏ నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం చేతి నిండా అరడజనుకు పైగా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్.. హ‌నురాగపూడి డైరెక్షన్‌లో ఫౌజీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నాల్లో ఉన్నాడు డార్లింగ్. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్‌తో ముందుకు సాగుతున్నాడు. అయితే.. ఇలాంటి క్రమంలో ప్రభాస్ రీసెంట్గా షూట్‌కి సడన్ బ్రేక్ ఇచ్చి ఏకంగా రూ.5 కోట్లు పెట్టి మరి టూర్ కి ప్లాన్ చేశాడంటూ ఓ న్యూస్‌ వైరల్‌గా మారుతుంది.

Prabhas's 'Fauji' is set to begin the next shooting schedule in Hyderabad  from THIS date | - The Times of India

నిజానికి ప్రభాస్ టూర్‌కి వెళ్లడానికి కారణం ఇదేనంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్ర‌భాస్ లెగ్ ఇంజ్యూర్‌ అయిందని.. దానివల్ల ఆయన టూర్ పేరుతో లెగ్ ఫ్రాక్చర్ కు అవసరమైన సర్జరీ చేయించుకోవడానికి వెళ్లారంటూ టాక్ నడుస్తుంది. ఏదేమైనా ప్రభాస్ ఆరోగ్య పరిస్థితి ఇంతకుముందులో మాత్రం లేద‌నేది వాస్తవం. ఇప్పటికే మనం పలు ఈవెంట్లలో ఆయన కాలు విషయంలో ఇబ్బంది పడిన సందర్భాలు చూసాం. ఆయన తరచుగా ఇటలీ వెళ్లి కార‌ణం కూడా.. ట్రీట్మెంట్ కోస‌మేన‌ట‌. ఇప్పటికే ప్రభాస్ ఆరోగ్యం చాలావరకు డిస్టర్బ్ అయిందని.. రాను రాను ప్రభాస్ డూప్ పెట్టుకొని ఎక్కువగా సినిమాలను చేస్తూ.. ఓన్లీ క్లోజ్ షార్ట్స్ మాత్రమే ఆయనపై ఆధారపడి చేయాల్సిన పరిస్థితి రావచ్చంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.