వోడ్కా తాగమంటున్న ప్రభాస్ సీత.. బండ బూతులు తిడుతున్న ఫ్యాన్స్..!

సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు పౌరాణిక పాత్రలో కనిపించాలంటే.. ఆ పాత్రలో నటించే నటీనటులు ఎంతో నిష్టగా ఉండేవాళ్ళు. ఉపవాసాలు, కటిక నేలపై నిద్రించడం లాంటి ఎన్నో కఠిన నియమాలను పాటిస్తూ ఉండేవాళ్లు. అది నటన అయినా.. ఎమోషన్స్ తో అనుసంధానమై దేవుడిలా కనిపించాలంటే.. నిజంగా ప్రజలతో కనెక్ట్ అవ్వాలంటే దైవభక్తి ఉండాలని.. అప్పుడే ఆ పాత్రలను పండించడం సాధ్యమని వారు నమ్మేవారు. కేవలం పాత్రను పండించడమే కాదు.. తర్వాత కూడా తమ నడ‌వడిక‌, ప్రవర్తన కొంతైనా పద్ధతిగా ఉండేలా వారు జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ.. ఈ జనరేషన్ సెలబ్రెటీస్ లో అదంతా మాయమైంది. ఈనాటి స్టార్ సెలబ్రిటీస్ అలాంటి నియమాలు కనీసం పాటించడానికి కూడా ఆలోచన చేయడం లేదు.

క‌నీస సామాజిక స్పృహ బాధ్యత కూడా లేకుండా పోతుంది. సినిమాలతో సంపాదన‌ చాలదని.. యాడ్స్ ద్వారా కూడపెడుతున్నారు. పోనీ అక్కడైనా బాధ్యతగా వ్యవహరిస్తున్నారా అంటే.. సిగరెట్స్, మద్యపానం, బెట్టింగ్ యాప్స్ లాంటి ప్రజల ఆరోగ్యానికి మానసిక ఒత్తిడికి కారణం అయ్యే హానికరమైన యాప్‌ల‌ను ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి యాడ్స్‌లో నటించిన సరికాదని సాధారణ ప్రేక్షకులు ఎంతగా మొత్తుకుంటున్నా.. కాసులకు కక్కుర్తి పడే సెలబ్రిటీలకు ఇది చెవికి ఎక్కడం లేదు. ఇటీవల ఎంతోమంది సార్ సెలబ్రెటీస్ బెట్టింగ్ ప్రమోషన్స్ యాప్ ల ద్వారా వివాదాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అలాగే.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ కూడా.. ఓ మద్యం బ్రాండ్ ప్రమోషన్స్ తో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు.

Advance booking opens for Prabhas-Kriti Sanon starrer Adipurush | Bollywood  News - The Indian Express

ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మ్యాజిక్ మూమెంట్స్ టాప్ వోడ్కా బ్రాండ్ కు అంబాసిడర్‌గా కృతి సనన్‌ సెలెక్ట్ అయింది. అంటే కష్టపడకుండానే యూత్ తాగడానికి ప్రోత్సహిస్తుంది. మ్యాజిక్ మూమెంట్స్ అంటే అనుభూతిని సొంతం చేసుకోవడం.. మ్యాజిక్ కుటుంబంలో చేరడం చాలా స్పెషల్ గా అనిపిస్తుందని.. ఉత్సాహంగా ఉందని.. మా భాగస్వామ్యం సరదాగా శక్తితో నిండి ఉంటుందని కృతి సన‌న్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. కాగా.. ఈమె గతంలో మన తెలుగు సినిమాల్లో నటించడ‌మే కాదు.. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ స‌ర‌సన.. ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటించింది. సినిమా రిజల్ట్‌ను పక్కన పెడితే.. ఈ సినిమాలో సీతగా ఓ పౌరాణిక పాత్రలో నటించిన ఆమె.. ఇప్పుడు వోడ్కా తాగమంటూ ప్రచారం చేయడం ఎవరికీ నచ్చడం లేదు. అసలు ఇది సరైన పద్ధతే కాదంటూ.. సీత పాత్రలో నటించిన నువ్వు.. వోడ్క తాగమని యూత్ కు ఎలాంటి సందేశం ఇస్తున్నావో అర్ధం అవుతుందా అంటూ.. నెటిజన్స్ మండిపడుతున్నారు.