బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్‌కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ రేంజ్లో తన లుక్స్ తో ఆకట్టుకునే హృతిక్ బాలీవుడ్లో ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్లు క్రియేట్ చేసుకున్నాడు. కేవలం బాలీవుడ్లోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీలోనూ ఆయనకు తిరుగులేని క్రేజ్ దక్కింది. తను హీరోగా నటించిన క్రిష్ సిరీస్, ధూమ్ 2 సినిమాలు తెలుగు వర్షన్ లో సంచలన రికార్డులు క్రియేట్ చేశాయి. అయితే.. హృతిక్ రోషన్ కెరీర్లో తన టాలెంట్‌కు తగ్గ కాంబినేషన్‌ను సెట్ చేసుకోవడంలో వెనకబడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోని నెంబర్ 1 సూపర్ స్టార్‌గా నిలవాల్సిన ఆయన వెనుకబడిపోయాడు అనే అభిప్రాయాలు ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
అయితే.. బాలీవుడ్లోనే కాదు.. సౌత్ లోనూ తనకు ఫుల్ క్రేజ్ ఉందని గ్రహించిన క్రమంలో.. హృతిక్ రోషన్ దానికి తగ్గట్టు సౌత్ మార్కెట్లో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే హృతిక్ రోషన్ సౌత్ హీరో ఎన్టీఆర్‌తో కలిసి వార్ 2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇది బాలీవుడ్ మూవీ అయినా.. పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. సౌత్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడం కాయం. కాగా.. హృతిక్‌కు మంచి మార్కెట్‌ని కేవలం ఒక్క సినిమాతో ఆయన సౌత్ మార్కెట్లో ఆగిపోవాలని భావించడం లేదు. ఈ క్రమంలోనే కేజిఎఫ్ సిరీస్ నిర్వహించిన హోంబలే ఫిలిం సంస్థ.. హృతిక్ రోషన్‌తో క్రేజీ ప్రాజెక్టుకు ఒప్పందం కుదుర్చుకుందని.. దానికి సంబంధించిన గ్రాండ్ ప్రకటన కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారని సమాచారం.
ఈ క్రమంలోనే సినిమాకు దర్శకుడిగా ప్రశాంత్ నీల్ వ్యవహరించనున్నరట. ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ రూపొందిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే.. ప్రభాస్ సలార్ 2 చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు అయిపోతే.. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రామ్ చరణ్‌తో మరో సినిమా చేయనున్నాడు. ఇలా.. వరుసగా మూడు ప్రాజెక్టల లైనప్‌తో బిజీబిజీగా గడుపుతున్న అనిల్.. ఈ మూడు సినిమాలు పూర్తి చేసిన వెంటనే హృతిక్ రోషన్‌తో సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఇక వార్ 2 పనులు పూర్తయిన వెంటనే.. క్రిష్ 4 సినిమా షూట్లో బిజీ అవనున్నాడు. ఈ సినిమాకు ఆయన దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడట. ఇదిపెద్ద ప్రాజెక్ట్ కావడంతో వర్క్ పూర్తి అవడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. ఈ లోపు ప్రశాంత్ నీల్.. తన ప్రాజెక్టులను పూర్తిచేసుకుని హృతిక్ తో కలిసి సినిమాకు ప్లాన్ చేస్తాడంటూ టాక్ నడుస్తుంది.