గద్ద‌ర్‌ అవార్డ్స్: చరణ్, తారక్, ప్రభాస్ లకు చోటే లేదా.. ఇదెక్కడి అన్యాయం రా సామి..!

తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా ప్రతిష్టాత్మకమైన గాద్ద‌ర్ అవార్డ్స్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచే ఆ అవార్డులను అఫీషియల్‌గా ప్రకటించింది. 2024వ సంవత్సరంలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలకు.. అందులో నటించిన నటీనటులకు తాజాగా ఈ అవార్డ్స్ ను ప్రకటించారు. ఇందులో భాగంగానే 2014 నుంచి 2023 వరకు రిలీజై భారీ సక్సెస్ అందుకున్న సినిమాల్లో కొన్నింటిని సెలెక్ట్ చేసి ఉత్తమ సినిమాల అవార్డ్స్ ను అందజేయనున్నారు. అయితే.. ప్రకటించిన ఈ అవార్డులో హైయెస్ట్ అవార్డులు అల్లు అర్జున్ సినిమాలకే ఉండడం చర్చనీయాంసంగా మారింది. ఉత్తమ నటుడు క్యాటగిరీలో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాను సెలెక్ట్ చేశారు.

అలాగే.. గతంలో ఆయన హీరోగా నటించిన అలవైకుంఠపురం మూవీ సపోర్టింగ్ రోల్‌లో రుద్రమదేవి సినిమాలకు కూడా అవార్డులు అనౌన్స్ చేశారు. అయితే.. ప్రస్తుతం ఈ అవార్డ్స్ విషయంలో ఇతర స్టార్ హీరోల అభిమానుల నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ లిస్టులో ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లకు అసలు ప్లేస్ దక్కకపోవడంతో అభిమానులు మండిపడుతున్నారు. వీళ్ళు చేసిన సినిమాలేవి మీకు కనిపించలేదా.. వాటికి ఒక్క అవార్డు కూడా ఎందుకు రాలేదు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో అయినా ఈ స్టార్ హీరోల సినిమాలను గుర్తించి అవార్డులు ఇవ్వకపోతే మీరు చేసింది పెద్ద తప్పిదమే అవుతుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Rangasthalam Director Sukumar To Collaborate With Baahubali Writer KV  Vijayendra Prasad For His Next - Filmibeat

2018 లో రామ్ చరణ్ నటించిన రంగస్థలంలో ఆయన నటన ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనవసరం లేదు అప్పట్లో విమర్శకులతో సైతం ప్రశంసలు దక్కించుకున్నాడు చరణ్. ఒక మాటలో చెప్పాలంటే.. గడిచిన దశాబ్ద కాలంలో నటనతో ఈ రేంజ్‌లో స‌త్త చాటుకున్న‌ నటుడు మరెవరు ఉండరేమో.. ఈ సినిమాలో ఆయన నటనకు నేషనల్ అవార్డు దక్కిన ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ.. వాళ్లు ప్రయత్నించలేదు. అలాంటి చరణ్‌ని గాద్ద‌ర అవార్డ్స్‌లో 2018 సంవత్సరంకు ఉత్తమ నటుడు కేటగిరీలో ఎందుకు సెలెక్ట్ చేయలేదంటూ అభిమానులు మండిపడుతున్నారు. అలాగే.. బాహుబలి 2 ప్రభాస్ న‌ట‌న ఎంత‌లా ఆకట్టుకుందో తెలిసిందే. ప్రభాస్ లేని బాహుబలి క్యారెక్టర్ ని ఎలా ఊహిస్తారు.. పాత్రకే వన్నె తెచ్చిన అంత గొప్ప నటుడు ప్రభాస్.

Jr NTR donates Rs 12.5 lakh to Andhra Pradesh temple ahead of Devara song  release | Telugu News - The Indian Express

కానీ.. ఆయనకు ఇప్పటివరకు ఆ పాత్ర కోసం ఒక‌ ప్రతిష్టాత్మక అవార్డును కూడా అందించలేదు. కనీసం మన ప్రభుత్వం మన వాళ్లను గౌరవించి.. వాళ్ళ నటనను గుర్తించకపోతే ఇంకెందుకు ఈ అవార్డులు అంటూ మండిపడుతున్నారు. ఇక ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద భారీ డైలాగులు అయినా అలవోకగా చెప్పగల తారక్.. ఎలాంటి పాత్ర అయ్యిన అల‌వోక‌గా మెప్పించ‌గ‌ల‌డు. వరుసగా టెంపర్ నుంచి దేవర వరకు ఏడు సూపర్ హిట్ సినిమాలు ఖాతాలో వేసుకున్నాడు. అలాంటి తారక్‌కు ఏడు సినిమాల్లో ఒక్క సినిమాకు అయినా అవార్డు ఇవ్వాలనిపించలేదా అంటూ.. కచ్చితంగా ఎన్టీఆర్, చరణ్, తారక్ ల‌కు అవార్డులు ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా లిస్టులో ఈ ముగ్గురు హీరోలను చేరుస్తుందో లేదో వేచి చూడాలి.