హిట్ ఇచ్చినా.. ఆ దర్శకులకు మరోసారి ఛాన్స్ ఇవ్వని తారక్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద డైలాగ్‌ అయినా, ఎలాంటి పాత్రనైన, ఎంత క‌ష్ట‌మైన స్టెప్స్ అయినా అలవోకగా నటించగల తారక్.. ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బ‌స్టర్లు ఖాతాలో వేసుకున్నాడు. కాగా.. తన సినీ కెరీర్‌ ప్రారంభంలో హిట్ ఇచ్చిన దర్శకులకు మరిన్ని అవకాశాలు ఇచ్చిన తారక్.. తర్వాత స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో.. బ్లాక్ బస్టర్ హీట్‌లు ఇచ్చిన డైరెక్టర్లకు సైతం ఛాన్స్ ఇవ్వకపోవడం అందరికి షాక్‌ను కలిగించింది. ప్రస్తుతం ఇదే న్యూస్ నెటింట హాట్‌ టాపిక్‌గా మారుతుంది.

ఇంతకీ ఆ దర్శకులు ఎవరు.. ఆ డిటెయిల్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. తనకు హిట్ ఇచ్చి తర్వాత అవకాశం దక్కించుకోలేకపోయినా దర్శకుల లిస్టులో కృష్ణవంశీ, వంశీ పైడిపల్లి, శీను వైట్ల, బాబి, త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్లు వినిపిస్తాయి. వీళ్ళందరితోను ఎన్టీఆర్ నటించిన సినిమాలు హిట్ అయినా.. మరో అవకాశాన్ని మాత్రం అందుకోలేకపోయారు. ఇక ప్రస్తుతం తారక్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్‌కు ఎదిగింది. అలా ప్రస్తుతం ఆయన నటించిన వార్ 2, డ్రాగన్ సినిమాలతో మార్కెట్‌ను మరింతగా పెంచుకోవడం ఖాయం అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ రెండు సినిమాల బిజినెస్ విషయంలో సైతం అద్భుతాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇక సినిమాల విష‌యంలో ఎన్టీఆర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ.. కొత్త సినిమాల ప్రకటనల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఎన్టీఆర్.. నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లోను ఓ సినిమా తెర‌కెక్కిస్తుండగా.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తారక్ లైన అప్ మాత్రం అదిరిపోయింది. దాదాపు2029 వరకు ఎన్టీఆర్ డేట్స్ ఖాళీగా లేవనే చెప్పాలి. ఈ క్ర‌మంలో ఫ్యాన్స్‌.. ఎన్టీఆర్ మ‌రింత ఎద‌గాల‌ని ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్‌ల‌తో మ‌ర్కెట్ మ‌రింత‌గా పెంచుకోవాల‌ని కోరుకుంటున్నారు.