తెలుగులో వెంకీ బన్నీ మాత్రమే బ్రేక్ చేయగలిగిన బ్యాడ్ సెంటిమెంట్.. ఏదో తెలుసా..?

స్టార్ హీరో, హీరోయిన్గా దర్శకుల నిర్మాతలుగా ఎదిగిన తర్వాత వారి నుంచి.. వారసులు ఇండస్ట్రీ లోకి హీరోలుగా, హీరోయిన్‌లుగా ఎంట్రీ ఇవ్వడం సాధారణంగానే జరుగుతూ ఉంటుంది. అయితే హీరోలు, హీరోయిన్ల పిల్లలు ఎంట్రీ ఇచ్చే సక్సెస్ అందుకుంటున్న రేంజ్‌లో.. నిర్మాతల వారసులు హీరోలుగా ఎంట్రీస్తే మాత్రం సక్సెస్ అందుకోర‌నే బ్యాడ్‌ సెంటిమెంట్ ఒకటి.. టాలఈవుడ్‌లో బలంగా వినిపిస్తుంది. అలా.. ఇప్పటికే ఎంతోమంది హీరోలుగా.. నిర్మాతల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సరైన సక్సెస్ అందుకోలేక సినిమాలకు గుడ్ బై చెప్పేసిన‌ సందర్భాలు ఉన్నాయి. అయితే.. నిర్మాతల తనయులు హీరోలుగా ఇండస్ట్రీలో రాణించలేరు అనే బ్యాడ్ సెంటిమెంట్‌ను టాలీవుడ్ లో బ్రేక్ చేసిన హీరోలు మాత్రం ఇద్దరే ఇద్దరు అనడంలో అతిశయోక్తి లేదు.

Venkatesh Father : నాన్న చివరి కోరిక తీర్చలేకపోయాను.. ఆ రెండు విషయాల్లో  బాధపడ్డారు.. బాలయ్య షోలో ఎమోషనల్ అయిన వెంకటేష్, సురేష్ బాబు.. | Venkatesh  and suresh ...

విక్టరీ వెంకటేష్ మొదటివాడు కాగా.. ఆయన తర్వాత అల్లు అర్జున్ ఆ బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేశాడు. ప్రపంచంలోనే హయ్యెస్ట్‌ సినిమాల ప్రొడ్యూసర్‌గా వ్యవహరించి.. గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్న దగ్గుబాటి రామానాయుడు తనయుడుగా.. వెంకటేష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. యాక్టింగ్ పై వెంకటేష్‌కు ఆసక్తి లేకున్నా.. తండ్రి బలవంతంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అలా 1986లో కలియుగ పాండవులు సినిమాతో నటుడుగా మారిన వెంకటేష్.. మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నాడు. తర్వాత మరెన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తన ఇంటి పేరుగా విక్టరీని మార్చేసుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే.. స్టార్ హీరోలలో ఒకరిగా ఎదిగాడు.

अल्‍लू अर्जुन के पिता अल्‍लू अरविंद तमिल सिनेमा में करेंगे कमबैक, बेटे के  साथ नहीं इस हीरो संग बनाएंगे फिल्‍म - allu arjun father allu aravind will  make comeback in ...

కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ.. అందరూ హీరోలతో ఫ్రెండ్లీగా ఉండడంతో ప్రతి ఒక్క హీరో అభిమాని కూడా వెంకటేష్‌ను అభిమానిస్తూ ఉంటారు. ఇప్పటికీ ఈ క్రమంలోనే వెంకటేష్ సినిమాలు మంచి రిజల్ట్‌ అందుకుంటున్నాయి. కాగా.. వెంకటేష్ కంటే ముందు ఎంతమంది నిర్మాతలు కొడుకులు ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టిన సక్సెస్ అయిందే లేదు. ఆ సెంటిమెంట్ ను మొదట వెంకీ బ్రేక్ చేశాడు. మళ్లీ అదే బ్యాడ్ సెంటిమెంట్ ను చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ బ్రేక్ చేసి చూపించాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన బన్నీ.. అంచెలంచెలుగా ఎదుగుతూ యాక్టింగ్ స్కిల్స్, డ్యాన్స్, డైలాగ్‌స్‌తో టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒకరిగా నిలిచాడు. ఐకాన్ స్టార్‌గా.. ప్రెజెంట్‌ పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్నాడు.