మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. కాగా.. ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను మరింతగా పెంచేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఇలాంటి క్రమంలోనే.. ప్రభాస్ పాత్ర గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. తాజాగా ప్రభాస్ రోల్ గురించి మంచి విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కన్నప్ప.. ప్రభాస్ స్క్రీన్ టైం ఎంత అనేదానిపై క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుతం విష్ణు ఇచ్చిన ఈ అప్డేట్ అందరికీ షాక్‌ను కలిగిస్తుంది. కాగా.. మంచు విష్ణు మాట్లాడుతూ ప్రభాస్ ను మొదట ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో తీసుకోవాలని భావించాం. కానీ.. మరో 30 నిమిషాలు స్క్రీన్ టైమ్ మరింతగా పెంచాల్సి వచ్చింది అంటూ వివరించాడు. అలా.. మొత్తం 50 నిమిషాల పాటు ప్రభాస్ ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేయొచ్చట. నాకు తెలిసి ఈ పాత్ర ప్రభాస్ లైఫ్ లో ది బెస్ట్ అవుతుందంటూ విష్ణు వెల్లడించాడు. పాత్ర అద్భుతంగా వచ్చిందని.. ప్రభాస్ హైట్, పేస్ కట్‌ని దృష్టిలో పెట్టుకుని రోల్ ను చాలా కేర్ఫుల్ గా డిజైన్ చేశాం. ప్రభాస్ కు.. నాన్న (మోహన్ బాబు)కు మధ్య వచ్చే సీన్లు అయితే మరింత ఆకట్టుకుంటాయి అంటూ వివరించాడు.
ఇందులో మోహన్ లాల్ పాత్ర స్క్రీన్ టైమ్ 15 మినిట్స్, అక్షయ్ కుమార్ స్క్రీన్ టైమ్ 10 మినిట్స్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు, సినిమా మొత్తం 3 గంటల 10 నిమిషాల రెన్ టైంతో రూపొందిందని.. ప్రభాస్ పాత్ర మూవీ పై భారీ ఎఫెక్ట్ చూపించనుందంటూ విష్ణు వెల్లడించాడు. ప్రస్తుతం విష్ణు చేసిన ఈ కామెంట్స్ తో ప్రభాస్ అభిమానుల్లోనే కాదు సాధరణ ఆడియన్స్‌లోను సినిమాపై మరింత ఆసక్తి మొదలైంది. ఏదో 10, 20 నిమిషాల ప్రభాస్ కనిపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ.. ఒక్కసారిగా ప్రభాస్ స్క్రీన్ టైం 50 మినిట్స్ అని తెలియడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.