ఆ స్టార్ కమెడియన్ దగ్గర రాజమౌళి అసిస్టెంట్గా చేశారా.. ఇది ఎక్కడి ట్విస్ట్ రా స్వామి..!

ద‌ర్శ‌కధీరుడు రాజమౌళి.. ఇప్పుడు ఇది పేరు కాదు ఒక బ్రాండ్. టాలీవుడ్ లోనే కాదు.. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. పాన్ ఇండియన్ డైరెక్టర్ గా రాజమౌళి మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. మొదట టాలీవుడ్ స్టార్ హీరోగా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్న రాజమౌళి.. బాహుబలితో పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా మారిపోయాడు. రాజమౌళి తెర‌కెక్కించిన బాహుబలి రెండు భాగాలుగా రిలీజై భారీ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత ఆయన రూపొందించిన ఆర్‌ఆర్ఆర్.. ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.

చరణ్, తారక్‌తో ఆర్ఆర్ఆర్‌ను తెర‌కెక్కించిన జక్కన్న.. ఏకంగా ఆస్కార్‌ను సొంతం చేసుకుని యావత్ తెలుగు ఇండస్ట్రీ నే తలెత్తుకునేలా చేసాడు. ఇక ప్రస్తుతం ఆయన మహేష్ హీరోగా మరో సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో జ‌క్కన పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేయనున్నాడని సమాచారం. అయితే.. అలాంటి రాజమౌళి గతంలో ఓ స్టార్ కమీడియన్ అసిస్టెంట్ గా పని చేశాడంటూ న్యూస్ వైర‌ల్ అవుతుంది. అతను మరెవరో కాదు వేణుమాధవ్. ఎస్.. మీరు విన్న‌ది క‌రెక్టే. కానీ.. ఇది రియల్ లైఫ్ లో అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే.

రాజమౌళి వేణుమాధవ్ అసిస్టెంట్ గా కనిపించింది ఓ సినిమాలో. ఆ సినిమా మరేదో కాదు రాజమౌళి దర్శకుడుగా వ్యవహరించిన సై. నితిన్ హీరోగా న‌టించి ఈ సినిమా మంచి స‌క్స‌స్ అందుకుంది. కాగా.. రాజమౌళి.. ఈ సినిమాలో వేణుమాధవ్ అసిస్టెంట్‌గా ఇలా వచ్చి అలా మాయమవుతాడు. ఈ చిన్న పాత్రలో రాజమౌళి కనిపించిన విషయం చాలామంది గుర్తించి ఉండరు. కాగా ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలోని రాజమౌళి చిన్న గెటప్ లో క‌నిపించి ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే.