టాలీవుడ్ నందమూరి నటసింహం ప్రస్తుతం ఫుల్ క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సినిమాల్లో, రాజకీయాలలో, బుల్లితెరపై కూడా భారీ పాపులారిటీతో రాణిస్తున్న బాలయ్య.. ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే పలు యాడ్ ప్రమోషన్స్ లో సైతం మెప్పిస్తున్నారు బాలయ్య. అలా తాజాగా ఆల్కహాలిక్ రిలేటెడ్ బ్రాండ్ ప్రమోషన్ లో ఆయన అంబాసిడర్‌గా వ్యవహరించాడు. అదే మెన్షన్ హౌస్. బాలయ్యకు మొదటి నుంచి మెన్షన్ హౌస్ తాగే అలవాటు ఉందని ఇండస్ట్రీలో గత కొద్ది రోజుల క్రితం వార్తలు తెగ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు స్వయంగా బాలకృష్ణ దానిని ప్రమోట్ చేయడంతో జనం ప్రస్తుతం ఈ యాడ్ గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోలో మెన్షన్హౌస్ను స్పాన్సర్ చేసే స్టేజ్‌కు ఆయన ఎదిగాడు. హీరోలంతా.. ఇప్పటికే చాలా రకరకాల యాడ్లలో నటిస్తూ ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్లు కూడా ఇప్పటికే పలు ఆల్కహాలిక్ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇలాంటి క్రమంలో.. బాలయ్య మాన్షన్ హౌస్ యాడఖ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. ఇందులో బాలయ్య.. సింహం పై స్వారీ చేస్తూ దుమ్మురేపాడు. చాలా కొత్త కంటెంట్‌తో ఆడియన్స్ ఆకట్టుకున్నాడు. బాలయ్యను సింహంతో పోలుస్తూ ఫ్యాన్స్ తెగ మురిసిపోతూ ఉంటారు.
అందుకు తగ్గట్టుగానే మెన్షన్ హౌస్ యాడ్‌లో అయినా సింహం పై స్వారీ చేస్తూ కనిపించాడు. ఓ షూటర్ సింహాన్ని గన్‌తో కాలుద్దామనుకుంటున్న టైంలో.. బాలయ్య సింహం పై సవారి చేస్తూ వచ్చి అన్నిటినీ లవ్ చేయి, ప్రేమతో వెల్కమ్ చేయి, ఏదైనా కొత్తగా ఓపెన్ చెయ్ అంటూ చెప్పిన డైలాగ్ మెన్షన్ హౌస్ ప్రమోషన్ యాడ్ మెప్పించింది. ఈ క్రమంలోనే యాడ్ రిలీజ్ అయిన కొద్దిసేపటికి బాలయ్య అభిమానులు తెగ ట్రెండ్ చేస్తూ మురిసిపోతున్నారు. ఇక మరో పక్క బాలయ్య యాంటీ ఫ్యాన్స్ మాన్షన్ హౌస్ కోసం అన్ని తిప్పలు అవసరమా అంటూ.. ఈ ఏజ్‌లో సింహం పై సవారి ఎందుకు బాసు అంటూ కామెంట్లు చేస్తున్నారు.