నాగార్జున ఇండస్ట్రియల్ హిట్ కొట్టకుండా అడ్డుకున్న బాలయ్య, చిరు.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్‌లో సీనియర్ స్టార్ హీరోలుగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో తెలిసిందే. ఇప్పటికి టాలీవుడ్ నాలుగు పిల్లర్లుగా నిలిచిన ఈ స్టార్ హీరోలు.. తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నారు. ఇలాంటి క్రమంలో నాగార్జునకు ఇండస్ట్రియల్ హిట్ రాకుండా చిరంజీవి, బాలయ్య అడ్డుకున్నారంటూ ఓ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. నాగార్జున కెరీర్‌ ప్రారంభంలో శివ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టి.. త‌న న‌ట‌న‌తో స్టార్‌డం అమాంతం పెంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో మాస్ సినిమాలతో సైత్ హిట్ కొట్ట‌గ‌ల‌న‌ని నిరూపించుకున్నాడు.

Aakhari Poratam Songs Download SouthMp3.Org

అప్పటి నుంచి ఫ్యామిలీ సినిమాలతో పాటు మాస్‌ సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసుకుంటున్న నాగార్జున.. రాఘవేంద్రరావు డైరెక్షన్లో ‘ ఆఖరిపోరాటం ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. అయితే.. ఈ సినిమా ఇండస్ట్రియల్ హిట్ కాకపోవడానికి చిరంజీవి.. యముడికి మొగుడు సినిమానే కారణం. ఈ సినిమా అప్పుడే రిలీజ్ అయి భారీ వసూళ‌ను కొల్లగొట్టడంతో పాటు.. లాంగ్ రన్ లో 100 రోజులకు పైగా ఆడి ఇండస్ట్రియల్ హిట్గా నిలిచింది. ఈ క్రమంలోనే చిరంజీవి సినిమా కారణంగా నాగార్జున సినిమా ఇండస్ట్రియల్ హిట్ కాకుండా ఆగిపోయింది. ఇక 1994లో నాగార్జున హీరోగా నటించిన మరో మూవీ హలో బ్రదర్స్. ఈ సినిమా.. ఇవివి సత్యనారాయణ డైరెక్షన్లో రూపొంది మంచి సక్సెస్ అందుకుంది.

Hello Brother (1994) - IMDb

అయితే ఇండస్ట్రియల్ హిట్ కాకపోవడానికి బాలయ్య బాబు భైరవద్వీపం సినిమా కారణం. హలో బ్రదర్ మూవీని భైరవద్వీపం డామినేట్ చేస్తూ భారీ వ‌సూళ‌ను కొల్లగొట్టడమే కాదు.. ఇండస్ట్రియల్ హిట్గా నిలిచింది. ఈ క్రమంలోనే నాగార్జున హలో బ్రదర్స్.. ఇండస్ట్రియల్ హిట్ కాకుండా ఆగిపోయింది. ఇలా మొత్తానికి చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు నాగార్జున సినిమాలను ఇండస్ట్రియల్ హిట్లు కాకుండా ఆపేసారు. ఇక ప్రస్తుతం నాగార్జున తన 100వ‌ సినిమాతో ఇండస్ట్రియల్ హిట్ కొట్టి సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం లోకేష్ కనకరాజు డైరెక్షన్లో కూలి సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న నాగార్జున.. ఈ సినిమా తర్వాత తన 100వ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాతో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.