ఫిలిం ఇండస్ట్రీలో అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకుని.. ఏవో కారణాలతో ఇండస్ట్రీకి దూరమై.. తర్వాత వేరే రంగాల్లో సెటిలై కోట్లు సంపాదిస్తున్న నటినటులు ఎంతో మంది ఉంటారు. అలాంటి వారిలో ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరో కూడా ఒకరు. అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఇండస్ట్రీకి వచ్చిన పదేళ్లకే ప్రమాదం కారణంగా కాలు పొగొట్టుకుని ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఆ గ్యాప్ లోనే వ్యాపారంలో సక్సెస్ సాధించి ఏకంగా రూ.3300 కోట్ల వ్యాపారానికి అధిపతిగా మారాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు అసలు ఆ విషయాలు ఏంటో ఒకసారి చూద్దాం. హీరో అరవింద్ స్వామి. 1991లో రజనీకాంత్ – మణిరత్నం కాంబోలో వేసిన దళపతి సినిమాలో నటుడుగా పరిచయం అయ్యాడు. అప్పటికి ఆయన వయసు కేవలం 20 ఏళ్లు.
మహాభారతం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో అర్జునుడి పాత్రలో నటించి మెప్పించాడు. అరవింద్ స్వామి నటనకు ఫిదా అయిన మణి రత్నం.. తన నెక్స్ట్ సినిమాలో హీరోగా ఆయనకు అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లోనే మాస్టర్ పీస్ గా ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకుంది. అదే రోజా మూవీతో అరవింద్ స్వామికి చాక్లెట్ బాయ్ ఇమేజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా తర్వాత మణిరత్నం డైరెక్షన్‌లో తెరకెక్కిన మరో మూవీ బాంబాయి లోను ఈయన నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. అలా వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రమంలో.. 2005లో ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో ఆయన కాలు పక్షవాతానికి గురవడం మంచానికి పరిమితం అయ్యాడు.
అరవింద్ స్వామి నెమ్మదిగా కోలుకున్నా ఫిలిమ్ ఇండస్ట్రీలో అప్పటికే ఆయన మార్కెట్ పోయింది. దీంతో వ్యాపారంపై దృష్టి పెట్టిన అరవింద్ స్వామి టాలెంట్ మాక్సిమస్ అనే కంపెనీని స్థాపించి దానిపై తన తెలివిని ఉపయోగించాడు. ప్రస్తుతం కంపెనీ నికర విలువ రూ.3300 కోట్లు. ఇక ప్రమాదం నుంచి బయటకు వచ్చిన అరవింద్ స్వామి.. మణిరత్నం డైరెక్షన్లోనే మళ్ళీ కడలి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయనకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం మోహన్‌రాజ డైరెక్షన్లో తెరకెక్కిన తని వరవం ఈ సినిమాలో స్టైలిష్ విలన్ గా కనిపించి ఆకట్టుకున్నాడు అరవింద్ స్వామి. ప్రస్తుతం మళ్లీ ఫామ్ లోకి వచ్చి వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈయన.. తెలుగులోను పలు సినిమాల్లో విలన్ పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక కేవలం నటుడు గానే కాదు.. దర్శకుడుగానే తన ప్రతిభను చాటుతున్నాడు. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన నవరస అనే వెబ్ సిరీస్ కు డైరెక్టర్ గా వివరించాడు అరవింద్ స్వామి. ప్రస్తుతం అరవింద్ స్వామి కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది.