18 ఏళ్లకే పెళ్లి,పిల్లలు.. రెండుసార్లు డివోర్స్.. స్టార్ హీరోయిన్లకు మించిన తోపు బ్యూటీ.. !

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారంతా లగ్జ‌రీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ పూలపాన్పుపై ఉంటారని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ.. అలా స్టార్ సెలబ్రెటీలుగా ఎదిగిన చాలామంది పర్సనల్ లైఫ్‌లో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. అందం న‌ట‌న‌తో ఆకట్టుకున్న.. రియల్ లైఫ్ లో ప్రేమ, పెళ్లి, విడాకులు అంటూ మానసిక వత్తిళ‌ను ఎదుర్కొంటూ సతమతమవుతారు. అలాంటి వారిలో పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఒకటి. అమ్మడి లైఫ్ కూడా విషాదమే. ఏకంగా రెండుసార్లు ప్రేమను నమ్మి మోసపోయింది. ఇంతకీ.. ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది.

Shweta Tiwari Biography, Age, Net worth, Shows

18 ఏళ్లకే ప్రేమించి వివాహం చేసుకుంది. 20 ఏళ్లకే తల్లి అయినా ఈ అమ్మడు.. కొంతకాలానికి అతనితో విడాకులు తీసుకుని మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ.. ఆబంధం కూడా నిలవలేదు. రెండుసార్లు డివోర్స్ తీసుకుని ఒంటరిగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం దేశంలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న న‌టిగా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటికైనా.. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. తనే నటి శ్వేత తివారి. టాలీవుడ్ ప్రేక్షకులకు అమ్మడి గురించి పెద్దగా పరిచయం లేకేన్నా.. బాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్న ఈ అమ్మడు.. హిందీలో ఎక్కువగా పాపులారిటీ దక్కించుకున్న సీరియల్.. కసౌటీ జిందగీకే సీరియల్లో నటించింది.

Shweta Tiwari Is All Hearts After A Beautiful Family Vacation With Her Kids

ఇందులో ప్రధాన పాత్ర నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రేరణ శర్మ అనే పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఏడోళ్లపాటు సీరియల్‌లో అలరించి.. బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో సందడి చేసింది. ఆటతీరుతో రియాలిటీ షో టైటిల్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ క్రమంలోనే అమ్మడు పేరు మారి మోగిపోయింది. దీంతో పాటు పర్సనల్ లైఫ్ కూడా వైరల్ గా మారింది. అటు ఫాలోయింగ్ సైతం విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్ లో బిజీగా గడుపుతున్న శ్వేతా నాయుడు వెండితెరపై తిరుగులేని న‌టిగా రాణిస్తుంది.