మొక్కల్ని కొనుగోలు చేసే స్థితిలో నేను లేను.. నా సంపాదనే అంతంత మాత్రం.. మెగాస్టార్

ఇటీవల రంగారెడ్డి జిల్లా పొద్దుటూరు ప్రాంతంలో ప్రపంచ స్థాయి ఏకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ పార్క్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రాండ్గా ఆరంభించాడు. ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్‌లుగా మెగాస్టార్ చిరంజీవితో పాటు.. పలువురు మంత్రులు హాజరై సందడి చేశారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆయన మాట్లాడుతూ ఈ ప్రదేశం మీ అందరికంటే ముందు నాకే బాగా తెలుసు అంటూ వెల్లడించాడు. గత కొంతకాలం క్రితం నేను హైదరాబాదులో కొత్త ఇల్లు కట్టుకుంటున్నానని తెలిసి రాందేవ్ నాకు కొన్ని మొక్కలను పంపించాడని.. రాందేవ్ ఇచ్చినా మొక్కలను నేను విదేశాలకు వెళ్ళినప్పుడు చూస్తుండే వాడిని.. అలాంటి అరుదైన మొక్కలు ఇక్కడ నాకు తెచ్చి ఇవ్వడంతో ఎంతో ఆనంద‌మ‌నిపించింది అంటూ చెప్పుకొచ్చాడు.

Experium Eco Friendly Park Inaugurated by Chiranjeevi, CM Revanth Reddy

మా ఇంట్లో నేను కూర్చునే ప్రదేశంలో.. బయటకు కనిపించకుండా ఈ మొక్కలను ఫెన్సింగ్ లా చేసి ఇవ్వమంటే రాందేవ్ చాలా అద్భుతంగా వాటిని డిజైన్ చేసి ఇచ్చాడని.. అలా మా ఇంటి చుట్టూ ఈ అద్భుతమైన మొక్కలను పెంచుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రాందేవ్ బిజినెస్ మ్యాన్‌గా నాకు ఎప్పుడు కనిపించడు.. ఒక కళాకారుడిగా అనిపిస్తాడు.. అందుకే నా మనసుకి అతను చాలా దగ్గర అయ్యాడు అంటూ వివరించాడు. అతని కలిసినప్పుడల్లా.. కొత్త మొక్కలు వచ్చాయి ఒకసారి వచ్చి చూస్తారా అని అడిగేవాడని.. వాటిని చూస్తే మొత్తం కొనేయాలనిపించేది. ఒకప్పుడు వాటి ధర వేలు, లక్షలు ఉండేవి.. ఇప్పుడు కోట్లల్లో ఉంటున్నాయి.. వాటిని కొనడానికి నేను సంపాదించే సంపాదన అస్సలు సరిపోదేమో అంటూ న‌వ్వుతూ కామెంట్స్ చేశాడు.

నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చి ఇవన్నీ చూస్తుండడం మనసుకి ఎంత ఆహ్లాద‌క‌రంగా అనిపిస్తుంది అంటూ వివరించిన మెగాస్టార్.. ఇక ఇలాంటి మొక్కలు పెట్టాలంటే కేవలం వ్యాపార దృక్పథం సరిపోదు.. కళ‌పై ఇష్టం, ప్రేమ ఉండాలి. రాందేవ్ గత పాతికేళ్లుగా ఇలాంటి ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. విదేశాల్లో మాత్రమే దొరికే ఎన్నో మొక్కలను కూడా ఇక్కడికి తీసుకువచ్చారు.. పీరియన్ లోని ఇలాంటి శిలాకృతులు హైదరాబాద్‌కి కొత్త అందాన్ని తీసుకొస్తాయని బలమైన నమ్మకం నాకుంది అంటూ చిరంజీవి వెల్లడించాడు. ఇక ఈ ఈవెంట్‌ మొత్తంలో చిరు, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న బాండింగ్ హైలెట్గా మారింది. అడుగడుగునా.. రేవంత్ రెడ్డి.. మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన గౌరవాన్నికి.. అభిమానులు ఫిదా అవుతున్నారు.