నందమూరి నటసింహం బాలకృష్ణ తన సినీ కెరీర్లో ఇప్పటికీ 100కు పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలకు ఇప్పటివరకు ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లుగా వ్యవహరించారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ల నుంచి.. జూనియర్స్ వరకు ఎంతోమంది బాలయ్య సినిమాలకు మ్యూజికల్ సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు. అయితే ప్రస్తుత జనరేషన్ లో బాలయ్య సినిమాలకు ఫామ్ లో మ్యూజిక్ డైరెక్టర్గా ఎస్ఎస్ థమన్, దేవిశ్రీప్రసాద్ ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరు కూడా బాలయ్య సినిమాలకు వరుసగా పని చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరిలో బాలయ్య లైక్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనే ప్రశ్న ఎదురుకాగా టక్కున బాలయ్య థమన్ పేరు చెప్పేశాడు.
దీంతో బాలయ్య మనసులో మొదటి స్థానం థమన్ కొట్టేసాడంటూ న్యూస్ తెగ వైరల్‌గా మారుతుంది. ఇక డిఎస్పి కూడా బాలయ్యకు మంచి సాంగ్స్ ఇచ్చారు. అయితే ఓ సినిమా టైంలో డిఎస్పీ, బోయపాటి మధ్య చిన్నపాటి డిస్కషన్ జరిగిందని.. అప్పటి నుంచి బాలయ్య సినిమాలకు డీఎస్పీని మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోవడం మానేసాడు అంటూ టాక్ ఉంది. ఈ క్రమంలోనే అప్పటి నుంచి బోయపాటి, థమన్‌ను.. బాలయ్య సినిమాలకు లైన్లో పెట్టడట. అలా ఇప్పటివరకు బోయపాటి – బాలయ్య సినిమాలకు వరుసగా థమన్ సంగీత దర్శకుడుగా ఉంటున్నాడు. ఇక బాలయ్య లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ కు మ్యూజిక్ డైరెక్టర్గా థమనే వ్యవహరించాడు.
త్వరలో ప్రారంభం కానున్న అఖండ 2 సినిమాకి థమన్ మ్యూజిక్ అందించనున్నాడు. అంతకుముందు రిలీజ్ అయిన భగవంత్ కేసరి, వీర సింహారెడ్డి, అఖండ ఇలా వరుస సినిమాలకు థమనే సంగీతం అందించాడు. ఇక థమన్ మ్యూజిక్ ఇచ్చినా అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొలగొట్టాయి. దీంతో థమన్.. బాలయ్య సెంటిమెంట్ పర్సన్ గా మారిపోయాడు. ఈ క్రమంలోనే బాలయ్య మోస్ట్ లైక్ మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ నిలిచాడు. ఈ నేపథ్యంలోనే మునుముందు వీళ్ళ కాంబినేషన్‌లో మరిన్ని సినిమాలు రానున్నాయి. ప్రస్తుతం థమన్.. అఖండ 2 పనుల్లో బిజీగా గడుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్‌లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.