అ టాలీవుడ్ క్రేజీ బ్యూటీ విరాట్ కోహ్లీ మరదలా.. ఎవరో తెలిస్తే నోరెళ్ళబెడతారు..!

ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆట తీరు, విధానంతో కొట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరికీ ఓ పాపా, బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ తన భార్య పిల్లలతో కలిసి లండన్లో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కోహ్లీ మరదలు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అని చాలామందికి తెలిసి ఉండదు. ఆమె ఎవ‌రో.. అసు డీటెయిల్స్ ఏంటో ఓ సారి చూద్దాం. బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా తిరుగులేని మ్యూజిక్ క్రియేట్ చేసుకున్నారు విరాట్, అనుష్క. వీరి జోడి కి వరల్డ్ వైడ్ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

World Cup 2023: Virat Kohli-Anushka Sharma, KL Rahul-Athiya Shetty, We Love  These Partners In Sledging

ప‌లు యాడ్ షూట్ల‌లో కలిసిన ఈ జంట.. చాలాకాలం ర‌హ‌స్య ప్రేమాయణం తర్వాత 2017 లో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. కాగా పెళ్లికి ముందు వరకు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా కొనసాగిన అనుష్క.. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. బీటౌన్‌ ఇండస్ట్రీలో సల్మాన్, షారుక్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో ఇప్పటికి దూరంగానే ఉంటుంది. అయితే అనుష్క చెల్లి టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ అని చాలామందికి తెలిసి ఉండదు. అనుష్క చెల్లి అంటే.. విరాట్ కోహ్లీకి మరదలు అవుతుంది. తెలుగులో వరుసగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. రూహిణి శర్మ. తమిళ్ ఇండస్ట్రీతో నటిగా పరిచయమైన ఈ అమ్మడు.. తర్వాత చి.లా.సౌ మూవీతో హీరోయిన్గా తెలుగు ఎంట్రీ ఇచ్చింది.

Ruhani Sharma Biography

మొదటి సినిమాలోనే త‌న న‌ట‌న‌తో ఆకట్టుకున్న రూహిణి.. తర్వాత తెలుగులో మంచి ఆఫర్లు కొట్టేసింది. హిట్‌, 101 జిల్లాల అందగాడు లాంటి సినిమాల్లో నటించింది. వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్‌ సినిమాలో చివ‌రిగా మెరిసింది. అయితే అమ్మడికి సరైన క్రేజ్ మాత్రం రాలేదు. తెలుగులో వరుస సినిమాలో నటించిన ఇప్పటివరకు స్టార్ స్టేటస్ అందుకు లేకపోయినా ఈ అమ్మడు.. ఇటీవల ఒక్క సినిమాను కూడా అనౌన్స్ చేయలేదు. ఇక తనకు విరాట్ బావ అవుతాడని.. తనతో ఎంతో సరదాగా ఉంటాడని.. గ‌తేడాది సైంధవ్‌ ఇంటర్వ్యూలో ఆమె వివరించింది. ఇక ప్రస్తుతం ఆ వీడియో నెటింట వైరల్ అవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.