కన్నడ సోయగం రష్మిక మందన కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో నేషనల్ క్రష్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప 1, పుష్ప 2తో ప్రపంచవ్యాప్తంగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. యానిమల్ సినిమాతో సంచలన సక్సెస్ అందుకుంది. తన కెరీర్‌లోనే ఎన్నో మంచి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. జాగ్రత్తగా కథలని ఎంచుకుంటూ సక్సెస్ సాధిస్తున్న ఈ అమ్మడు.. సమంత లానే ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతుందట.
తన అందంతో దగదగా మెరిస్తూ.. చర్మఛాయతో అందరిని ఆకట్టుకునే రష్మిక.. తన వృత్తిలో భాగంగా ముఖానికి మేకప్ వేసుకునేందుకు ఎన్నో రసాయనాలు కలిపిన కాస్మెటిక్స్ ను వాడాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ఆ కెమికల్స్ కలిపిన మేకప్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ముఖం మొత్తం దద్దుర్లు రావడం, మంట లాంటి సమస్యలతో చర్మవ్యాధి బారిన పడి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుందని.. చర్మవ్యాధుల స్పెషలిస్ట్‌ను రష్మిక కలిసినప్పుడు ఆమెకు ఈ వ్యాధి ఉన్నట్లు తెలిందని సమాచారం.
చర్మంపై తరచుగా మంట రావడం, ఎరుపు, దద్దుర్లు వస్తున్నాయని ప్రస్తుతం రష్మిక వైద్యుల సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకుంటుందట. రసాయనాలు కలిపిన కాస్మెటిక్స్ వల్ల ముఖ్యంగా ముఖంపైనే కాకుండా శరీరంపై కూడా దద్దుర్లు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ అవడంతో.. రష్మిక ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు. తెరపై అంత అందంగా కనిపించే రష్మిక.. తన అందం కోసం తెర వెనుక ఎన్నో కష్టాలు అనుభవిస్తుందంటూ షాక్ అవుతున్నారు.