పుష్ప 2 సంధ్య థియేటర్ తొక్కిసులాట కేస్ రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో.. రేవతి అనే మహిళా మృతి చెందగా.. ఆమె కొడుకు శ్రీ తేజ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉందంటూ.. తాజాగా పోలీసులు బులెటెన్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో శ్రీ తేజను పరామర్శించేందుకు తెలంగాణ రాష్ట్ర హెల్త్ సెక్రటరీ, అలాగే పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కొద్ది గంటలో హాస్పిటల్ కి వెళ్ళనున్నాడట.
ఇప్పటికే ఆ బాలుడు తల్లి శ్రీ తేజను కాపాడే ప్రయత్నంలో మరణించగా.. తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబానికి శ్రీ తేజ పరిస్థితి విషమించడం మరోసారి సుఖసంద్రంలో ముంచేస్తుంది. అల్లు అర్జున్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా బన్నీ శ్రీ తేజ కుటుంబాన్ని పరామర్శించిందే లేదు. ప్రస్తుతం మద్యంతర బెయిల్‌పై ఉన్న ఆయన.. శ్రీ తేజ ఫ్యామిలీని కలవకూడదని ఆంక్షలు ఉన్నాయంటూ పోస్ట్ పెట్టి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో శ్రీ తేజ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న కిమ్స్ హాస్పిటల్ కి పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కొద్దిసేపట్లో వెళ్ళనున్నాడట.
ఇక ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న శ్రీతేజను పరామర్శించిన తర్వాత సివీ ఆనంద్ ఏం చేయబోతున్నారు అనే ఆసక్తి అందరిలో మొదలైంది. మరోవైపు బన్నీ పై మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. గత శుక్రవారం సంధ్య థియేటర్ కేసులో బన్నీని పోలీసులు అరెస్ట్ చేయగా.. నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టులో అప్పటికే వేసిన క్వాష్ పిటిషన్ విచారణ జరిగాక.. బన్నీకి మధ్యంతర బెయిల్ దొరకడం.. ఒకరోజు రాత్రి జైల్లో గడిపిన బన్నీ రిలీజ్ అయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మరోసారి క్షమాపణలు చెబుతూ ఫ్యామిలీకి అండగా ఉంటానంటూ హామీ ఇచ్చిన అల్లు అర్జున్.. శ్రీ తేజ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేశాడు.