అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ఏ రేంజ్‌లో సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. ఈ క్రమంలోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ వ్యవహారంపై మాట్లాడుతూ ఘాటు కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. సంధ్య థియేటర్ ప్రీమియర్స్‌లో జరిగిన ఘటన గురించి ఆయన వివరిస్తూ.. సినీ పరిశ్రమ మొత్తం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డాడు. ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ఒక్కరోజు మాత్రమే జైలుకు వెళ్ళాడు. అతను థియేటర్ కు వెళ్లడం వల్ల అతనికి ఎలాంటి నష్టం జరగలేదు.
ఏమైనా దెబ్బలు తగిలాయ.. అతనికి చిన్న ఘాటైనా అయినా ఉందా.. కానీ అక్కడ ఒక తల్లి మరణించింది.. ఆ తల్లి బిడ్డ చావు బ్రతుకులతో కొట్టుమిట్టాడుతున్నాడు.. అయినా సినీ పరిశ్రమ ఆ అబ్బాయి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోయారు. అల్లు అర్జున్ ని జైల్లో ఒకరోజు పెట్టారో లేదో.. అతనికి ఏదో జరిగిపోయినట్టు అంతా వెళ్లారు అంటూ ఫైర్ అయ్యాడు. సినీ ఇండస్ట్రీ ప్రవర్తించిన తీరుపై రేవంత్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేయడమే కాదు.. ఇకపై నేను సీఎం గా ఉన్నన్ని రోజులు సినిమాలపై స్పెషల్ బెనిఫిట్ షోస్ కానీ.. అదనపు టికెట్ రేట్స్ ఇవ్వడం కానీ జరగదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన చేసిన ఈ ప్రకటన టాలీవుడ్ మొత్తానికి బిగ్ షాక్ కలిగిస్తుంది.
అల్లు అర్జున్ ప్రోటోకాల్ అసలు అనుసరించలేదంటూ.. సీఎం రేవంత్ రెడ్డి క్లియర్‌గా వెల్లడించాడు. దీనిపై.. అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. మరోవైపు హైదరాబాద్ పోలీసులు బన్నీకి బెయిల్ రద్దు చేయమంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతున్నాయి. మరోపక్క శ్రీ తేజ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుందని డాక్టర్స్ హెల్త్ బుల్లెటెన్ రిలీజ్ చేశారు. రెండు మూడు సార్లు కళ్ళు కూడా తెరిచి చూశాడని… అతని బాడి ట్రీట్మెంట్‌కు రియాక్ట్ అవుతుందని.. కానీ.. అతను ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడు అంటూ వివరించారు. రెండు రోజుల క్రితమే అల్లు అర్జున్ తండ్రి శ్రీ తేజను కలిసి అతని ఆరోగ్యం పై ఆర తీశారు. అల్లు అర్జున్ కూడా త్వరలో ఈ పిల్లాడిని కలబోతున్నాడని తెలుస్తుంది. మరో పక్క.. అల్లు అర్జున్ ఆ అబ్బాయి ఆరోగ్యం మెరుగుపడేందుకు కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్, ట్రీట్మెంట్ అందిస్తున్నాడట. ప్రభుత్వం కూడా అబ్బాయి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.