ఎన్టీఆర్ లేడీ గెటప్ లో నటించిన మూవీ ఏంటో తెలుసా.. స్టార్ కమెడియన్ తో డ్యూయెట్ కూడా..?

నందమూరి నట‌సార్వ‌భౌమ‌ టాలీవుడ్ నటదిగ్గజం సీనియర్ ఎన్టీఆర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఆధార అభిమానాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీఆర్.. తన నటనతోనే కాదు వ్యక్తిత్వంతోను ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాలతో ఆడియ‌న్స్‌ను మెప్పించిన ఎన్టీఆర్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజాసేవతోను ఆకట్టుకున్నాడు. అలాంటి ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

ఇక ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. సినిమాకు తగ్గట్లుగా కొన్ని సందర్భాలలో గెటప్ లు మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్ ఓ సినిమాలో లేడీ గెటప్ తో మెప్పించారు. అంతేకాదు స్టార్ కమెడియన్ తో డ్యూయెట్ కూడా వేసుకున్నారు. అప్పట్లో ఆ సాంగ్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఇంతకీ.. ఆ మూవీ ఏంటో చెప్పలేదు కదా.. అదే అన్న తమ్ముడు. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ అచ్చ గుద్దినట్లు ఓ మహిళా, మధ్యతరగతి ఇల్లాలి గెటప్‌లో కనిపించారు. కొప్పు పెట్టుకుని.. అందమైన చీర కట్టు, ముక్కు పుడకతో పాటు పర్ఫెక్ట్ లేడీ మేకవర్తో మెరిసాడు.

JioSaavn - Listen to New & Old Indian & English Songs. Anywhere, Anytime.

ఇక అప్పటి స్టార్ కమెడియన్ రేలంగి తో కలిసి ఆయన చేసిన డ్యూయెట్ కు అప్పట్లో విపరీతమైన హైప్ నెల‌కొంది. ఇక.. ఇప్పుడు జనరేషన్ వారు.. ఆ సాంగ్ చూసిన ఎన్టీఆర్ నట‌న‌కు ఫిదా అవ్వాల్సిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ సాంగ్ సంబంధించిన ఓ రీల్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇది చూసిన నెటిజన్‌లు.. రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. నటన విషయంలో ఆయన తర్వాతే ఎవరైనా అంటూ.. ఎప్పటికీ సినీ ఇండస్ట్రీలో ఆయన పాత్ర చెరిగిపోదు అంటూ.. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ లాంటి మరో నటుడు దొరకడం చాలా కష్టం అంటూ.. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.