టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్స్ సన్నివేశాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పటి స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ నటించింది. అలాంటి విజయశాంతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెల్లమెల్లగా సినిమాలకు దూరమవుతూ వచ్చింది. 2005 నుంచి సినిమాలకు పూర్తిగా దూరమైన ఈ అమ్మడు.. దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో సినిమాతో రిఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాలో ఆమె నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అమ్మడికి ఎన్నో ప్రశంసలు దక్కాయి. తెలుగు సినీ పరిశ్రమకు లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విజయశాంతి.. యాక్షన్ సినిమాల్లో ఫైటర్ గా, కర్తవ్యం సినిమాతో భరతనారిగా, పెంకి పెళ్ళాం సినిమాతో క్రేజీ భార్యగా ఇలా వైవిధ్యమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది. అటు యాక్షన్ సీన్స్ తో మెప్పిస్తూనే.. మరో పక్కన రొమాంటిక్ సన్నివేశాలతోనూ ప్రేక్షకులు కవ్వించింది. గ్లామర్ డాల్ గా మెరిసింది. అయితే గతంలో ఆమె సినిమా షూట్స్ సమయంలో ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొందట.
అలా ఓ సినిమాలో కదులుతున్న ట్రైన్ నుంచి పక్క కంపార్ట్మెంట్కు వెళ్లాలని.. ఆ టైంలో జస్ట్ మిస్ అయితే కింద పడేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. తర్వాత ఓ తమిళ సినిమా షూటింగ్లో తనను కుర్చీలో బంధించి గుడిసెకు నిప్పు పెట్టే సీన్ ఉంటుంది.. అందులో ఆమెను తాళాలతో కట్టేసారని.. అయితే ఆ టైంలో గాలి ఎక్కువగా రావడంతో.. ఆ నిప్పువచ్చి చీరకు అంటుకుంది అంటూ వెల్లడించింది. అది చూసి వెంటనే హీరో విజయ్ కాంత్ మంటలు లెక్క చేయకుండా లోపలికి వచ్చి తనను కాపాడారని.. అలా చాలాసార్లు ఎన్నో ప్రమాదాలు అంచుల వరకు వెళ్లి వచ్చాను అంటూ విజయశాంతి వెల్లడించింది. ప్రస్తుతం విజయశాంతి కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.