సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు ఎదగడం అంటే అది సులువైన విషయం కాదు. ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణించడం అంటే అది మరీ కష్టం. అవకాశాల కోసం నిత్యం వందలాది ఆఫీసులు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అలా ఎంతో కష్టపడి అడుగు పెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న వారు ఉన్నారు. అలా తమ నటనతో ప్రేక్షకులకు దగ్గరైన తర్వాత తమ కెరీర్ స్టార్టింగ్ లో తమ ఎదుర్కొన్న కష్టాల గురించి పలు సందర్భాల్లో వివరిస్తూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలను అధిగమించి.. సెలబ్రిటీలుగా రాణిస్తున్న వారు కొత్తగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాలనుకునే లక్షలాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రస్తుతం ఈ పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా అదే కోవకు చెందుతుంది. ఈమె టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న ఒక క్రేజీ బ్యూటీ. ఒకప్పుడు పెళ్లి వేడుకల్లో ఫుడ్ సర్వర్‌గా వ్యవహరించిన ఈ ముద్దుగుమ్మ.. తన చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలను చెవి చూసిందట. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ నటిగా దూసుకుపోతుంది. ఆమె మరి ఎవరో కాదు రాకీ సావంత్. నార్త్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలోనే కాదు సోషల్ మీడియాలోనూ పలు పాటలకు డ్యాన్స్ స్టెప్స్ వేస్తూ ప్రధాన పాత్రలో నటిస్తూ మెప్పించింది. 1978 నవంబర్ 25న ముంబైలో పుట్టిన ఈ అమ్మడు అసలు పేరు నెహ్రూ బేడా. తండ్రి వర్లీలో కానిస్టేబుల్ గా వ్యవహరించేవారు.
ఈ క్రమంలోనే చిన్నప్పటి నుంచి ఆర్థికంగా, మానసికంగా కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను అంటూ ఆమె చాలా ఇంటర్వ్యూలో వివరించింది. తన పదేళ్ల వయసు నుంచే ఉద్యోగం చేస్తున్నానని.. ముంబైలో కేటరింగ్ సర్వీస్, ఫుడ్ సర్వర్ గా వ్యవహరించానని.. అప్పుడు తన జీతం రోజుకు రూ.50 అంటూ వెల్లడించింది. తను సినిమాలోకి రావడం తల్లిదండ్రులకు అసలు ఇష్టం లేదని.. తనకు మాత్రం చిన్నప్పటి నుంచి సినిమాలోకి రావాలనే కోరిక ఉండేది అంటూ వెల్లడించింది.
దాంతో కుటుంబ సభ్యులను వ్యతిరేకించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు వెల్లడించింది. కాలేజీ చదువు పూర్తయిన వెంటనే నటన రంగంలోకి రావాలని తన తపనకు నిరాసే మిగిలిందని.. రంగు తక్కువ ఉండడంతో అవకాశాలు ఇచ్చేందుకు ఎవరు ముందుకు రాలేదని.. దీంతో తన శరీరం, ముఖానికి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు వివరించింది. చికిత్స తర్వాత తనకు అవకాశాలు మొదలయ్యాయని.. అగ్ని చక్రంతో బాలీవుడ్లో మొదట అవకాశం దక్కిందని వెల్లడించింది. ఇక తర్వాత పల సినిమాల్లో నటిస్తే బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. తన డ్యాన్స్‌తోనూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక గత కొంతకాలంగా సినిమాలకు ఈ అమ్మడు దూరంగా ఉంటుంది.