టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. ఈ ఏడది సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ నుంచి సోలో సినిమా వచ్చి దాదాపు ఆరేళ్లు కావడం.. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతుండడంతో.. సినిమాపై ప్రేక్షకుల్లో రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్గా.. అలాగే మరో నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు. కాగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే ప్రీమియర్ షో తో కాస్త నెగటివ్ టాక్ వచ్చినా మెల్లమెల్లగా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో కలెక్షన్ల పరంగా ప్రొడ్యూసర్లకు అలాగే డిస్ట్రిబ్యూటర్ నాగ వంశీకి భారీ లాభాలు బచ్చాయి. ఇక ఇటీవల ఈ సినిమా రూ.500 కోట్ల కలెక్షన్లకు క్రాస్ చేయడమే కాదు.. దేవర 16ం రోజు కలెక్షన్లతో బహుబలి 2 రికార్డ్‌ను కూడా బ్రేక్ చేసింది.
అయితే ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే థియేటర్లలో చూసేసిన అభిమానులు కూడా.. మరోసారి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో తమ అభిమాన హీరోను చూసుకోవాలని ఆరాటపడుతున్నారు. అయితే తాజాగా దేవర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 8 నుంచి దేవర స్ట్రీమింగ్ కానుంది అని సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.