ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి తర్వాత హీరోయిన్లుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ట్రెండ్ మరింత ఎక్కువగా నడుస్తుంది. ఈ క్రమంలోనే బాలనటులుగా చేసి హీరోయిన్లుగా మారిన ముద్దుగుమ్మల చిన్ననాటి ఫొటోస్ నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే పై ఫోటోలో చూస్తున్న అమ్మడు కూడా ఇదే లిస్ట్‌కు చెందుతుంది. రామ్ చరణ్ హీరోగా నటించిన రచ్చ మూవీలో తమన్నా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాలో తమన్నా చిన్నప్పటి క్యారెక్టర్ ని పై ఫోటోలో చూస్తున్న అమ్మడు నటించి మెప్పించింది. ఇంతకీ ఈమె పేరు చెప్పలేదు కదా తనే విసికా కోటా. ఈ అమ్మడు ఇప్పటికే ఏందిరా ఈ పంచాయతీ, సగిలేటి కథ లాంటి సినిమాలో నటించి మెప్పించింది. మరికొన్ని సినిమాల్లో కూడా కీలక పాత్రలో ఆకట్టుకుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను షేర్ చేసుకుంది. రచ్చ లోనే కాదు.. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించానని.. ఆ మూవీ షూటింగ్ టైంలో నేను చరణ్, తమన్నలను అసలు కలవలేదు అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఇప్పుడు నన్ను వాళ్ళిద్దరూ చూసినా గుర్తుపట్టే ఛాన్స్ లేదంటూ షేర్ చేసుకుంది. 19 జులై 1998న తెలంగాణ హైదరాబాదులో పుట్టిన విసిక గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి.. తర్వాత నటనపై ఉన్న ఇంట్రెస్ట్‌తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ నటించేందుకు విసిక ముందుంటుంది. ఈ క్రమంలో అమ్మడి చిన్ననాటి ఫోటోతో పాటు.. ప్రస్తుతం ఉన్న యంగ్ లుక్ ఫొటోస్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఈమె అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈ తెలుగు అమ్మాయికి మంచి అవకాశాలు ఇస్తే.. తన సత్తా చాటుకుంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.