తారక్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌… 100 మందితో ఫైట్‌… కెరీర్‌లోనే ది బెస్ట్‌…!

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బ‌స్టర్ మూవీస్‌ ఉన్నాయి. తారక్ సినిమాలో యాక్షన్ సీన్స్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. దేవర సినిమాలో సైతం యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఆడియన్స్‌ను మెప్పించాయి. అయితే ప్రస్తుతం తారక్ నటిస్తున్న వార్‌2 సినిమాలో సైతం యాక్షన్ సీన్స్ ఇదే రేంజ్‌లో ఉండబోతున్నాయని.. ఈ మూవీలో తారక్ ఏకంగా 100 మందితో ఫైట్ చేసే సీన్స్ ఆడియన్స్ కు గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయని.. సినిమాకి ఇది హైలెట్‌గా నిలవ‌నుందని టాక్.

Jr NTR and Hrithik Roshan Gear Up for Epic Action in 'War 2'

వార్ 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలవాలని.. టాలీవుడ్ ఆడియన్స్‌ను కూడా సినిమా విపరీతంగా ఆకట్టుకోవాలని.. ఈ రేంజ్ లో తార‌క్‌ను ఎలివేట్ చేస్తూ సినిమా రూపొందించనున్నారట‌. యాక్షన్ సీన్స్ తో పాటే ఎంటర్టైన్మెంట్ కు కూడా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో సినిమాలో వంద మందితో ఫైట్ సీన్ తారక్ కెరీర్ లోనే బెస్ట్ సీన్ గా నిలిచిపోతుందంటూ తారక్ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ మరింత పవర్ ఫుల్ గా ఉండేందుకు అత్యంత భారీ స్థాయిలో ఖర్చు చేసి మరి ప్లాన్ చేస్తున్నారట.

Devara: Part 1 movie trailer: Jr NTR, Janhvi Kapoor and Saif Ali Khan in  action thriller

బడ్జెట్ రూ.400 నుంచి రూ.500 కోట్లుగా ఉండనుంద‌ని సమాచారం. ఇక సినిమా షూట్ ఆలస్యం కావడంతో ప్రశాంత్ నీల్‌ సినిమా విషయంలో కూడా ఆలస్యం జరుగుతుందట. అయినా ఆ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక రోజురోజుకు విపరీతంగా తారక్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఈ క్రమంలో ఆయన నుంచి ఫ్యూచర్లో రానన్న వార్‌2, ప్రశాంత్ నీల్‌ సినిమాలు ఏ రేంజ్ లో ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.