రజనీకాంత్ కు అమ్మగా, లవర్ గా , భార్య‌గా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

స్టార్ హీరో రజనీకాంత్.. సౌత్‌ సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసింది. కేవలం సౌత్ ఇండిస్ట్రీలోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకుని తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు మడత పెడుతున్న రజినీకాంత్.. ఏడుపాయల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటికీ రజిని సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. ఫ్యాన్స్‌లోను లో పండగ వాతావరణం మొదలైపోతుంది.

Film History Pics on X: "(1976) Sridevi and Rajinikanth in a still from her  first film as a lead actress, K Balachander's 'Moondru Mudichu'. #Sridevi @ rajinikanth https://t.co/SOsWWoOusK" / X

అంతేకాదు తమిళ్ ఇండస్ట్రీలో అయితే రజిని నుంచి ఓ సినిమా రిలీజ్ అవుతుంది అంటే కంపెనీలకు హాలిడే కూడా ప్రకటిస్తున్నాయి. ఈ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్న రజినీకాంత్.. ప్రస్తుతం ఒక సినిమాకు దాదాపు రెండు వందల కోట్ల రెమ్యూనరేషన్ చార్జ్‌ చేస్తున్నాడట. అలాంటి రజనీ కెరీర్లో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ తో నటించి మెప్పించాడు. ఇక రజనీకాంత్‌కు తన సినీ కెరీర్ లో అమ్మగా, లవర్ గా, భార్య‌గా ఓ హీరోయిన్ నటించిన సంగతి చాలామందికి తెలియదు.

Did you know Sridevi was paid more than Rajinikanth during 'Moondru Mudichu'?  | Tamil Movie News - Times of India

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారా.. తనెవరో కాదు దివంగత నటి.. అతిలోకసుందరి శ్రీదేవి. ఎస్..మీరు విన్నది నిజమే. రజినీకాంత్ కు సినిమాలో శ్రీదేవి అమ్మగాను నటించింది. తన కెరీర్లో కేవలం 13 ఏళ్ల వయసులోనే రజినీకాంత్‌కు తల్లిగా నటించి ఆకట్టుకుంది శ్రీదేవి. 1976 లో రిలీజ్ అయిన ముండ్రుముదిచు సినిమాలో రజనీకాంత్‌కు తల్లిగా నటించిన శ్రీదేవి.. తర్వాత రజినీకాంత్‌కు జంటగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాల్లో భార్యగా, లవర్ గా ఆకట్టుకుంది. అలా ఇప్పటివరకు రజిని సినీ కెరీర్‌లో అమ్మగా, లవర్ గా, భార్య‌గా నటించిన ఏకైక హీరోయిన్ శ్రీదేవి కావడం విశేషం.