ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావుని డామినేట్ చేసిన ఫిమేల్ యాక్టర్ ఎవరో తెలుసా.. సావిత్రి కాదట..!

ఇండస్ట్రీలో ఎంతో ప్రతిభను ప్రదర్శించి.. గౌరవం, గుర్తింపు దాక్కించుకొని ఆడియన్స్‌లో తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకున్న తర్వాత కూడా కొందరు నటి,నటీమణులు ఇండస్ట్రీకి దూరమై మరుగున పడిపోతూ ఉంటారు. ఎంత స్టార్ ఇమేజ్ తో వెలుగు వెలిగిన.. ఒక్కసారి వారు మరుగునపడిన తర్వాత అసలు వాళ్ళు ఏమైపోయారు అనే విషయాన్ని కూడా చాలామంది పట్టించుకోరు. అలా అలనాటి నటీమణులలో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని మరుగున పడిన నటుల్లో సూర్యకాంతం ఒకటి. 1924.. కాకినాడలో జన్మించిన సూర్యకాంతం.. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సూర్యకాంతం గయ్యాళి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అప్పట్లో ఆమెకు అలాంటి పాత్రల్లో పోటీ మరొకరు ఉండేవారు కాదు. ఒకవేళ ఉన్న సూర్యకాంతం రేంజ్ లో నటించి మెప్పించడం అసాధ్యం అనేలా ఆమె నటన ఉండేది. చాలామంది అభిమానుల్లో ఈమె ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకుంది.

అయితే సినీ ఇండస్ట్రీ, ప్రభుత్వం త‌న‌ను సరిగ్గా గుర్తించలేదని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో సీనియర్ నటుడు మురళీమోహన్ ఒకరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మురళీమోహన్ సూర్యకాంతం గురించి మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను సూర్యకాంతం, సావిత్రి లాంటి మహానటిమణులతో కలిసి నటించలేక‌పోయాన‌ని.. సాధారణంగా ఇండస్ట్రీలో ఓ మాట అంటారు. ఎస్వి రంగారావు సీన్ లో ఉంటే ఆయన డామినేషన్ ముందు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా తట్టుకోలేరని.. ఇక నిజానికి ఎస్విఆర్ డైలాగ్ డెలివరీ ఆ రేంజ్ లో ఉండేది మరి. కానీ.. అలాంటిది ముగ్గురు హీరోల‌ను డామినేట్ చేసి సూర్యకాంతం తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సాధారణంగా సావిత్రి పేరు చెబుతూ ఉంటారు.. కానీ సావిత్రి కంటే సూర్యకాంతమే ఎక్కువగా ఆ ముగ్గురు హీరోలను డామినేట్ చేసిందంటూ ముర‌ళి మోహ‌న్ వివ‌రించారు.

ఎంతో సహజంగా అనర్గ‌ళంగా ఆమె చెప్పే డైలాగ్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేవి. గయ్యాళి పాత్రలో నటించినా.. నిజజీవితంలో సూర్యకాంతం గారు అందరినీ ఎంతో ఆప్యాయంగా, గౌరవంగా పలకరించేవారు.. అందరితోను ప్రేమగా ఉండేవారు అంటూ మురళీమోహన్ చెప్పుకొచ్చాడు. అలాంటి నటిని ప్రభుత్వాలు, సినీ ఇండస్ట్రీ గుర్తించలేదన్నమాట వాస్తవం అని ఆమె విగ్రహాన్ని కూడా పెట్టలేకపోయాం,. అలాంటి నాటికి పద్మశ్రీ ఇవ్వాలంటూ చెప్పుకొచ్చారు. ఆమెకు ఎప్పుడు రవ్వంత గర్వం కూడా ఉండేది కాదని వివరించారు. ఇక యాంకర్ ప్రశ్నిస్తూ ఆమె చనిపోయినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదట కదా అని అడగగా.. అవును వెళ్లలేదు. దురదృష్టం అలా ఉంది. ఆమెని ఎవరు గుర్తుంచుకోలేదంటూ చెప్పుకొచ్చాడు. సావిత్రి గారికి కూడా ఇంచుమించు అలాగే జరిగిందని.. ఆమె చనిపోయినప్పుడు కూడా పట్టుమని పదిమంది వెళ్లలేదంటూ వివరించాడు. నేను, దాసరి గారు, ఏఎన్ఆర్ గారు మాత్రమే వెళ్ళామంటూ మురళీమోహన్ చెప్పుకొచ్చాడు.