ఈ రెండు పిలకల చిన్న‌ది ఇప్పుడు ఇండస్ట్రీలోనే డేరింగ్ అండ్ డాషింగ్ బ్యూటీ.. గుర్తుపట్టారా..?

ఇండ‌స్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు అడుగు పెట్టి రాణించిన తర్వాత ఎంతో మంది స్టార్ సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ ఎప్పటికప్పుడు నెటింట వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా త్రో బ్యాక్ థీంతో ఈ పై ఫోటోలో రెండు పిలుకలతో క్యూట్‌గా ముద్దొస్తున్న చిన్న పాప ఫోటో ఒకటి తెగ వైరల్ గా మారుతుంది. ఈ చిన్నది ఇప్పుడు ఓ డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరోయిన్. తెలుగులో పలు సినిమాలో నటించిన ఈ అమ్మ‌డు హిందీలోను ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. మొద‌ట మోడ‌ల్‌గా కెరీర్ ప్రారంభించిన‌ ఈ ముద్దుగుమ్మ.. తర్వాత సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించి.. తమిళ, హిందీ భాషలను ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

Did you know Taapsee Pannu underwent chemical treatment to straighten her  curly hair? | Hindi Movie News - Times of India

తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న క్రమంలో.. బాలీవుడ్ అవకాశాలు రావ‌డంతో అక్కడికి మ‌క్కాం మార్చేసింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. స్టార్ హీరోయిన్ తాప్సి. మొదటి 2010లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర డైరెక్షన్లో ఝుమ్మంది నాదం సినిమాతో మంచు మనోజ్ జంటగా నటించి మెప్పించింది. ఈసినిమా మంచి సక్సెస్ అందుకోడంతో ప‌లు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇక 2011లో వెట్రిమారన్‌ డైరెక్షన్లో తెరకెక్కిన ఆడుకలం మూవీతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో ధనుష్ జంట‌గా నటించి మెప్పించింది. ఇక 2013లో వరుణ్ దావన్ ష‌ష్మే బాదుర్‌ సినిమాలో నటించి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని. దీంతో బాలీవుడ్లో అమ్మడుకు వరుస అవకాశాలు క్యూ క‌ట్టాయి.

Taapsee Pannu slammed for wearing Hindu goddess neckpiece on plunging  neckline outfit

అప్పటికీ తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఈ అమ్మ‌డు బాలీవుడ్లో అవకాశాలు రావడంతో అక్కడిక చెక్కేసింది. బేబీ పింక్, ది ఘాజీ అటాక్, బాధల్‌, మిషన్ మంగళ్‌, తప్పడ్, హసీనా దిల్ రుబా, రష్మీ రాకెట్ ఇలా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ బ్యూటీగా దూసుకుపోతున్న తాప్సి ఎప్పుడు ఏ విషయం గురించి ఓపెన్ గా మాట్లాడాలన్నా.. ముక్కు సూటిగా మాట్లాడుతూ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. కేవలం గ్లామరస్ పాత్రలోనే కాదు.. లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లోను తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తాప్సి.. కమర్షియల్ సినిమాల్లోనూ మెప్పిస్తుంది. తన అద్భుతమైన నటనతో ఇప్పటికే రెండు ఫిలింఫేర్ అవార్డులు, అలాగే ఫిలింఫేర్ ఓటీటీ అవార్డులు కూడా దక్కించుకుంది. వీటితోపాటు ఇంకా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది.