టాలీవుడ్ కు సమంత గుడ్ బై.. స్టార్ బ్యూటీ షాకింగ్ డెసిషన్.. నిజమెంత..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీగా సమంత గతంలో ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోస్ కూడా ఈమెతో కలిసి సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉండేవారు. అయితే నాగచైతన్య, సమంత విడాకుల తర్వాత సమంత వార్తల తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. పలు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్ లో సమంతకు సక్సెస్ కూడా రాలేదు. అయితే తర్వాత మయాసైటీస్ కారణంగా సినిమాకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు.. గత ఏడాదిన్నరగా ఒక సినిమాలోని నటించలేదు. కాగా కొంతకాలంగా వార్తల్లో వినిపించని సమంత పేరు.. నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్‌తో మరోసారి వార్తల్లో వైరల్ గా మారింది. శోభిత‌, నాగచైతన్య ఎంగేజ్మెంట్ పై సమంత ఎలా రియాక్ట్ అవుతుందో.. ఏ విధంగా స్పందిస్తుందో.. అనే ఆసక్తి ప్రేక్షకులలో నెలకొంది.

అయితే సమంత మాత్రం డైరెక్ట్ గా కానీ.. ఇన్ డైరెక్ట్ గా కానీ.. ఇప్పటివరకు నాగచైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత ఒక్క పోస్టును కూడా సోషల్ మీడియాతో షేర్ చేసుకోలేదు. అయితే ఇలాంటి క్రమంలో సమంత, నాగచైతన్య పెళ్లి విషయంపై ఏ విధంగానూ రియాక్ట్ అవ్వదలచుకోలేదని.. సన్నిహిత వర్గాల సమాచారం. ఈ విషయం గురించి ఆలోచించి మనసు పాడుదలుచుకోలేదట శ్యామ్. అలాగే టాలీవుడ్‌కు కూడా కాస్త బ్రేక్ ఇచ్చి కొంతకాలం ముంబైలో కానీ, చెన్నైలో కానీ సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయిందట. ఇప్పటికే ముంబైలో సమంతకు సొంత ఫ్లాట్ ఉందని.. అలాగే బాలీవుడ్‌ వెబ్ సిరీస్‌ల‌లో నటించే అవకాశాలు రావడంతో.. టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసి ముంబైలోనే ఉండిపోవాలని సమంత అనుకుంటుందట.

దీనికి తగ్గట్టుగానే బాలీవుడ్‌లో సమంతకు కూడా ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్‌ల‌లో అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఇక నాగచైతన్యత విడాకుల తర్వాత.. ఎంతో కృంగిపోయిన సమంత ఇప్పుడిప్పుడే ఆ ఇబ్బందుల నుంచి బయటపడుతుంది. ఇలాంటి టైంలో నాగచైతన్య మరో పెళ్లికి సిద్ధం అవడంతో.. మరోసారి సమంతకు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ చైతు రెండో పెళ్లిపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందనే విషయంపై మీడియా ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె హైదరాబాద్ రావడం ఇష్టం లేదని.. అందుకే ముంబైలోనే ఉండిపోతుందని కొందరి వాదన. మరి ఇక సమంత టాలీవుడ్ లో ఎప్పుడు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుందో వేచి చూడాలి.