ఆ స్టార్‌ హీరోని పెళ్లి చేసుకోవాల్సిన దేవయాని.. కానీ ఆ హీరోయిన్ ఎంట్రీ తో..?

సీనియర్ నటి దేవయాని అంటే ఇప్పటి సినీ ప్రియులకు కూడా పరిచయమైన పేరే.. ఎందుకంటే ఈమె అరవింద సమేత లో ఎన్టీఆర్ తల్లిగా,జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ పెద్దమ్మగా..లవ్ స్టోరీ లో సాయి పల్లవి తల్లిగా నటించింది. అయితే ఈమె ప్రస్తుతమైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తమిళ, మలయాళ,తెలుగు భాషల్లో కలిపి మొత్తం 70 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

దేవయాని (Devayani): సినిమాలు, వయస్సు, బయోగ్రఫీ, ఫోటోలు, ఫిల్మోగ్రఫీ -  Filmibeat Telugu

అలా ఈ హీరోయిన్ పేరు చెప్పగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం సినిమా గుర్తుకొస్తుంది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో నటించిన ఈ ముద్దుగుమ్మ తన స్టార్డం ని ఎక్కువగా కాలం నిలుపుకోలేకపోయింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది సంవత్సరాల కి రాజ్ కుమార్ అనే డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే మొదట ఈ హీరోయిన్ మరో హీరోని పెళ్లి చేసుకోవాల్సిందట. కానీ ఓ హీరోయిన్ ఎంట్రీ తో పెళ్లికి బ్రేక్ పడిందట. ఇక దేవయాని పెళ్లి చేసుకోవాల్సిన హీరో ఎవరు? వీరిద్దరి మధ్య వచ్చిన హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..

దేవయాని అప్పట్లో ఓ హీరో ని పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్లు వినిపించాయి. ఇక ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్ నటుడు శరత్ కుమార్.. ఈయన వరలక్ష్మీ శరత్ కుమార్ తండ్రి అలాగే సీనియర్ నటి రాధిక మూడో భర్త.. అయితే అలాంటి శరత్ కుమార్ దేవయాని కాంబినేషన్లో అప్పట్లో కొన్ని సినిమాలు వచ్చాయి. అలా సినిమాల సమయంలో వీరిద్దరి మధ్య ఉన్న బంధం పెళ్లి వరకు వెళ్లినట్టు తమిళ మీడియాలో ప్రచారం జరిగింది.కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ శరత్ కుమార్ దేవయానిని కాకుండా రాధికను పెళ్లి చేసుకున్నారు.

Is 'Varisu' actor Sarathkumar hospitalized? here's what we know | Tamil  Movie News - Times of India

అయితే అప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన శరత్ కుమార్ కి ఆర్థికంగా రాధిక సహాయం చేయడంతో ఆమెతో ఫైనాన్షియల్ గా, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి రాధిక ని పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వినిపించాయి. అలా దేవయాని శరత్ కుమార్ ల మధ్యలో రాధిక ఎంట్రీ తో సీన్ మొత్తం రివర్స్ అయింది అని అప్పటి కోలీవుడ్ జనాలు మాట్లాడుకున్నారు.