సీనియర్ నటుడు సుమన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. సినిమాల్లో వెంకటేశ్వర స్వామి పాత్రకు ఐకాన్‌గా నిలిచాడు. టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న తర్వాత.. అనుకొని పరిణామాలతో కెరీర్ నాశనం చేసుకున్నారు. అసభ్య వీడియోల కేసులో చిక్కుకుని కొన్నాళ్లపాటు జైలు జీవితం గడపడంతో ఈయనకు ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు. మరి సినిమాల్లో హీరోగా చేసిన ఆ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో సుమన్ కెరీర్ మెల్లమెల్లగా డౌన్ ఫాల్ మొదలైంది. ఒకప్పుడు చిరంజీవి, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు పోటీగా తన సినిమాల్లో మెప్పించిన ఆయన.. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో రజనీకాంత్, కమలహాసన్‌ల గురించి చెప్పిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
1978, 79 లలో రజనీకాంత్, కమలహాసన్ స్టార్ హీరోలుగా రాణించారని.. రజనీకాంత్ స్టైల్ గా సిగరెట్లి ఫ్లిప్ చేయడం.. నడకలో స్టైల్.. స్పీడ్ తో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడని వివరించారు. ఇక కమలహాసన్ మంచి రొమాంటిక్ హీరో అని.. అప్పట్లో యూత్‌కు ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచాడని.. ముంబై నుంచి బట్టలు తెప్పించుకుని మరీ డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకునే వారిని.. సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ చేస్తుంటే చాలా సహజంగా అనిపిస్తుందని.. మన కళ్ళు ముందు జరుగుతున్నట్లు అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. కమల్ హాసన్ డీ గ్లామరస్ రోల్స్ అయినా ఆలోచించకుండా చేసేయగలరని.. నాయకుడు మూవీలో పొట్ట, బట్టతో కనిపించిన ఆయన సినిమా కోసం గుండు చేయించుకున్నారు, గడ్డం పెంచుకున్నారు.
దశావతారం సినిమాలో ఆయన చేసిన పాత్ర గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. భారతీయుడు మూవీలో ఓల్డ్ గెటప్ కోసం హాలీవుడ్ నుంచి మేకప్ అర్టిస్ట్‌లు వచ్చారంటూ చెప్పుకొచ్చాడు. మేకప్ చాలా తక్కువసేపే ఉంటుంది. చెమటలు పడితే ఊడిపోతుంది.. అందుకే ఆయన రెస్ట్ లేకుండా సీన్స్ వరుసగా పూర్తి చేసేవాడని.. డి గ్లామర్ రోల్స్ చేయాలంటే మేము చాలా భయపడే వాళ్ళం. కానీ ఆయనకు మాత్రం ఆ భయమే ఉండేది కాదు. ఎలాంటి రోల్ అయినా ఇట్టే చేసేవారంటూ చెప్పుకొచ్చాడు. ఆయనకు గాడ్ గిఫ్ట్ గా నటన దొరికిందని.. కూతురు శృతిహాసన్ తో కూడా ఆయన రొమాంటిక్ సన్నివేశాలను చేసి మెప్పించగలడంటూ సుమన్ వివరించాడు. ప్రస్తుతం కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ సుమన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.