టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వల్‌గా పుష్ప 2 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షూట్ సమయంలో బన్నీ – సుకుమార్ మధ్యన ఏవో వివాదాలు జరిగాయంటూ.. గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ విషయంలో సుకుమార్, అల్లు అర్జున్ మధ్య విభేదాలకు కారణం సుకుమార్ చెప్పిన మాట వినకుండా అల్లు అర్జున్ గడ్డం చేయించుకోవడమేనని.. అల్లు అర్జున్ చేసిన పనికి సుకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని.. దీంతో వెకేషన్ అంటూ షూటింగ్ ఆపేసి అమెరికా వెళ్ళిపోయాడని వార్తలు వచ్చాయి.

అది తెలిసిన బన్నీ కూడా ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్‌కు వెళ్లడని రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇక అల్లు అర్జున్ 3 యూనిట్లతో షూటింగ్ చేయించాలని కోరగా.. సుకుమార్ మాత్రం దానికి అంగీకరించలేదని.. ఈ క్రమంలో విరి మదిన గొడవలు మొదలయ్యాయి అంటూ కూడా పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలో ఈ విషయంపై అల్లు అర్జున్ డిజిటల్ టీమ్ స్పందించారు. శరత్ చంద్ర అనే వ్యక్తి మాట్లాడుతూ ఈ వివాదాలకు సంబంధించిన షాకింగ్ విషయాలను రివీల్ చేశాడు. ఓ అభిమాని ఆయనను అడిగిన ప్రశ్నకు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించాడు. సుకుమార్ గారు సినిమా ఎడిటింగ్ మొదలు పెట్టేసాడని.. ఫస్ట్ పార్ట్ ఎడిటింగ్ చేస్తున్న క్రమంలో చిన్న బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందని.. ఎడిటింగ్ సమయంలో బ్రేక్ తీసుకోవడం చాలా కామన్ అంటూ వివరించాడు.

దానికి మరొక అభిమాని షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఒకేసారి చేయొచ్చు కదా.. ఇప్పుడు ఎందుకు.. మొదలు పెట్టేసారని అడగగా.. ప్రస్తుతం టైం దొరికింది. ఫస్ట్ అఫ్ కంప్లీట్ చేసుకుని కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ అంతా రెడీ చేసి పెట్టుకుంటే.. మిగతా ఎడిటింగ్.. షూటింగ్ పూర్తి అయిన వెంటనే చేసేసుకోవచ్చనే ఉద్దేశంతో అలా చేస్తున్నాం. హ్యాపీగా డిసెంబర్ 6న సినిమాలు రిలీజ్ చేయొచ్చు అందుకే అలా ప్లాన్ చేసి ఉండొచ్చు అని వివరించాడు. దీంతో అల్లు అర్జున్, సుకుమార్ మధ్యన ఎలాంటి విభేదాలు తలెత్తలేదని.. కేవలం సమయం దొరకడంతోనే వారి పనులు వారు చేసుకుంటున్నారని.. బన్నీ టీం అందరికీ క్లారిటీ ఇచ్చినట్లయింది.
Adedo shoot complete ayipoyaka post production Antha complete ayipoyaka long break teesukovachu kada chandra Naidu anna
— Icon StAAr Bunny 🔥🔥 (@SrikarunaPanga) July 18, 2024

