వావ్: వాట్ ఏ కాంబో..ఆ తెలుగు హీరోకి తల్లి గా జ్యోతిక..!?

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జ్యోతిక .. బంపర్ ఆఫర్ అందుకుందా ..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . జ్యోతిక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాక ఎలా తన క్రేజ్ హవాను కొనసాగిస్తుందో మనకు తెలిసిందే. కాగా రీసెంట్ గా జ్యోతిక తెలుగు సినిమా కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అది కూడా ఒక తెలుగు హీరోకి తల్లి పాత్రలో కనిపించబోతుందట . అది మరెవరో కాదు నాగచైతన్య టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య..

ప్రజెంట్ తండేల్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా తర్వాత కార్తీక్ వర్మ దండుతో ఒక సినిమా ఒక సినిమాకు కమిట్ అయ్యాడు . విరుపాక్ష తర్వాత అలాంటి ఓ కాన్సెప్ట్ వస్తున్న సినిమా ఇదే కావడం గమనారహం. ఈ సినిమాలో నాగచైతన్యకు తల్లి పాత్రలో జ్యోతిక కనిపించబోతుందట . అంతేకాదు ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటించబోతుంది అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఈ సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా పుచ్చుకుంటుందట జ్యోతిక .

దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా నాగార్జున జ్యోతిక కలిసి మాస్ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వీళ్ళిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోలేదు ఇప్పుడు ఆయన కొడుకుతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండడం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. మొత్తానికి జ్యోతిక మంచి ఛాన్స్ నే పట్టేసింది..!!