ఇప్పుడు ఏపీలో ఎలాంటి హీట్ వాతావరణం నెలకొందో మనందరికీ తెలిసిందే . బయట సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. అంతకు మించిన రేంజ్ లో ఏపీ పాలిటిక్స్ హీట్ పెంచేస్తున్నాయి . కేవలం కొద్ది గంటలే ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కాబోతుంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ నేతలు బీపీ పెంచేసుకుంటున్నారు . హార్ట్ బీట్ డబ్ డబ్ అంటూ కొట్టుకుంటుంది . ఎప్పుడు ఏం జరుగుతుందో ..? ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో..? అంటూ టెన్షన్ పడుతున్నారు .
పలు ఎగ్జిట్ పోల్స్ పలానా క్యాండిడేట్స్ గెలుస్తారు.. పలానా పార్టీ నేతలే ఈసారి అధికారం చేపట్టబోతున్నారు అని చెప్పిన సరే కొంతమంది రాజకీయ నేతలు మాత్రం గతంలో జరిగిన రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకుంటున్నారు . ఎగ్జిట్ పోల్స్ చెప్పిన తర్వాత కూడా ఏపీ రాజకీయ చరిత్రలో ఎన్నో పార్టీలు అధికారం చేపట్టాయి .. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . రీసెంట్గా రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ లో టిడిపి అధికారం చేపట్టబోతుంది అని చెప్పిన విషయం తెలిసిందే .
అయితే టిడిపి అధికారం చేపట్టినా.. చంద్రబాబు నాయుడు సీఎం గా వచ్చినా.. టిడిపిలోని స్టార్ కాండిడేట్ మాత్రం ఈసారి కూడా బకరా అవ్వాల్సిందే అంటూ రాజకీయ నేతలు మాట్లాడుకుంటున్నారు . ఆయన ఎవరో కూడా అందరికీ తెలిసిందే . టిడిపిలో యాక్టివ్ గా ఉన్నట్టే ఉంటాడు కానీ ఏది ఆయన సొంతగా చేయడు.. బ్యాక్ గ్రౌండ్ నుంచి స్క్రిప్ట్ ఇస్తేనే ఆయన స్టేజ్ పై ఎక్కి చదువుతాడు.. ఏది చెప్తే అది తూచా తప్పకుండా చదివి అప్పజెప్పడం ఈ లీడర్ స్పెషాలిటీ .. చాలామంది ఇతగాడిని సోషల్ మీడియాలోకి ట్రోలింగ్ కి గురి చేస్తూనే ఉంటారు. ఒకవేళ టిడిపి గెలిచిన.. ఆయన ఆ నియోజకవర్గంలో గెలిచిన.. పెద్దగా పీకేది ఏమీ లేదు అని చంద్రబాబు నాయుడు కూడా ఆయనను చాలా సైలెంట్ గా దూరం పెట్టేస్తాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ట్రోలర కూడా అతగాడిని ట్రోల్ చేస్తున్నారు..!