మరికొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. అందరికీ కొత్త టెన్షన్స్ పుట్టిస్తున్న పవన్ కళ్యాణ్ బిహేవియర్…!?

పవన్ కళ్యాణ్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్.. ఇప్పుడు రాజకీయాలలో పవర్ ఇవ్వబోతున్నాడు.. పవర్ రాబట్టబోతున్నాడు.. పవర్ తెచ్చుకోబోతున్నాడు.. ఎస్ ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరే మారు మ్రోగిపోతుంది. ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పటినుంచి ఒక లెక్క అనే డైలాగ్ను బాగా ట్రెండ్ చేస్తున్నారు పవన్ అభిమానులు . త్వరలోనే ఏపీ రాజకీయ చరిత్ర తిరగరాయబోతున్నాడు పవన్ కళ్యాణ్ అన్న కామెంట్స్ మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూనే వస్తున్నాం .

కేవలం కొద్ది గంటల్లోనే ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఏపీ అంతటా హై టెన్షన్ వాతావరణ నెలకొంది . అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు హై సెక్యూరిటీ క్రియేట్ చేశారు . అంతేకాదు పలువురు రాజకీయ నేతల ఇంటి వద్ద కూడా హై సెక్యూరిటీ పెట్టేశారు . అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిహేవ్ చేస్తున్న పద్ధతి ఇప్పుడు ఏపీ రాజకీయాలలో కొత్త టెన్షన్స్ పుట్టిస్తుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

కాగా గత కొన్ని గంటల నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎటువంటి ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదట. ఎవరికి అందుబాటులోకి ఉండకుండా సైలెంట్ గా ఉండిపోతున్నారట . చంద్రబాబునాయుడు కాల్ చేసిన కూడా ఎటువంటి విధంగా రెస్పాండ్ అవ్వడం లేదట. దీంతో ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతుంది..? అనే వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాగా ప్రచారం చేశారు . సడన్గా ఓట్ల లెక్కింపుకి మరికొద్ది గంటలు ఉండగా ఎందుకు పవన్ కళ్యాణ్ – చంద్రబాబు నాయుడు కాల్ లిఫ్ట్ చేయడం లేదు.. ఏ రాజకీయ నేత తో టచ్ లో లేడు అనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది..!?