కల్కి ..సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఒకటే డౌట్ . ఈ సినిమాలో అసలు హీరో ఉన్నాడా ..? ఉంటే ఆ హీరో ఎవరు? అసలు భైరవ పాత్రలో ప్రభాస్ ఎలా నటించడానికి ఒప్పుకున్నాడు..? స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్న పాన్ ఇండియా హీరో ఈ సినిమాలో నటించడానికి కారణం ఏంటి ..? ఎస్ ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కల్కి సినిమా రిలీజ్ అయింది . అభిమానులను ఆకట్టుకుంటుంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది . ఇండస్ట్రీ షేకింగ్ రికార్డ్స్ రాబోతున్నాయి అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్.
అయితే ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ కొన్ని కొన్ని విషయాలపరంగా హర్ట్ అవుతున్నారు. ఏదైనా సినిమా రిలీజ్ అయింది అంటే కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కొట్టింది అంటే ..ఆ సినిమాలో ప్రధానంగా హీరో పేరే హైలెట్ అవుతుంది. కానీ కల్కి సినిమా విషయంలో మాత్రం పూర్తి డిఫరెంట్గా మారిపోయింది . ఈ సినిమా హిట్ కొట్టడానికి ఏకైక కారణం డైరెక్షన్ అని ఒకరు .. మరికొందరు అశ్వినీ దత్ కష్టమని కామెంట్స్ చేస్తున్నారు .
రెండో ప్లేస్ లోనే మూడో ప్లేస్ లోనూ ప్రభాస్ పేరు వినిపిస్తుంది . అంతేకాదు చాలావరకు ఈ సినిమాలకు రివ్యూ ఇచ్చే వాళ్ళు కూడా ప్రభాస్ నటనపరంగా ఓకే.. ఆయన పాత్రకు న్యాయం చేశాడు అంతవరకే ఇస్తున్నారు.. తప్పిస్తే ఎక్కడ కత్తి – తోపు – తురుము అనే రేంజ్ లో రివ్యూలు ఇవ్వడం లేదు . రివ్యూస్ మొత్తం కూడా నాగ్ అశ్వీన్ నే హైలెట్ చేస్తున్నారు . సినిమాకి కర్త – కర్మ – క్రియ అంతా కూడా నాగ్ అశ్వీన్ నే అని.. కేవలం స్క్రీన్ పై నటించిన హీరో మాత్రమే ప్రభాస్ అని .. తెర వెనక నటించిన హీరో నాగ్ అశ్వీన్ అంటూ ఈ సినిమాకి రియల్ హీరో నాగ్ అశ్వీన్ అంటూ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ కామెంట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయ్..!