ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నోడు ఓ స్టార్ హీరో.. పవర్ ఫుల్ విలన్ కూడా.. ఎవరో గుర్తుపట్టారా..?!

ఈ పై ఫోటోలో అమ్మతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న కుర్రాడు సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరో. పాన్ ఇండియా లెవెల్ లో పవర్ ఫుల్ హీరో. మొదటి సినిమా ప్లాప్ అవడంతో నటన రాదంటూ పలువురి విమర్శలు ఎదుర్కొన్న ఈ యంగ్ హీరో.. ఈ సినిమా తర్వాత ఏడేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. ఇక తన సెకండ్ సినిమాతో మాస్ కం బ్యాక్ ఇచ్చి మొత్తం ఇండస్ట్రీ అంతా తనువైపు తిరిగేలా చేసుకున్నాడు.

Nazriya Nazim Fahad Fazil with Family - YouTube

ఇక ఈయన తండ్రి మలయాళ సినీ పరిశ్రమలో పాపులర్ డైరెక్టర్, అలాగే భార్య కూడా స్టార్ హీరోయిన్. ఇప్పటికైనా ఆయన ఎవరో గుర్తుపట్టారా.. అతను మరెవరో కాదు మళయాళ‌ స్టార్ హీరో ఫాహ‌ద్ ఫాజిల్‌. సూపర్ డీలక్స్ , విక్రమ్, మామ్మన్న‌న్‌ లాంటి సినిమాల్లో నటించి పాపులారిటి దక్కించుకున్న ఫాహ‌ద్‌.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మలయాళ పాపులర్ డైరెక్టర్ బాసిల్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక ఫ‌హ‌ద్‌ భార్య నజ్రియా నజీమా స్టార్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే.

What is your opinion on the ongoing argument that Fahad Fazil does not  deserve Nazriya? - Quora

టాలీవుడ్‌లోను పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తన సినిమాలతో లక్షలాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నఫాహ‌ద్ ను ముద్దుగా ఫాఫా అని అభిమానులు పిలుస్తూ ఉంటారు. ఇక తాజాగా ఫాహ‌ద్‌ నటించిన ఆవేశం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాతో పవర్ఫుల్ విలన్ గా మెప్పించి పాన్ ఇండియా ఇమేజ్ ద‌క్కించుకున్నాడు. ఇక పుష్ప సీక్వెల్‌తో మరోసారి తన విశ్వరూపం చూపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.