విజయ్ దళపతి బర్త డే స్పెషల్: తెలుగులో ఆయన అభిమానించి-ఆరాధించే ఏకైక స్టార్ హీరో ఇతడే..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా జనాలకు తమకంటూ కొందరు ఫేవరెట్ హీరోస్ ఉంటారు. ఆ ఫేవరెట్ హీరో పుట్టినరోజు నాడు చేసే హంగామా అంతా ఇంత ఉండదు . రచ్చ రంబోలా చేసేస్తారు . కుర్చీని మడత పెట్టి సాంగ్ రేంజ్ లో అందర్నీ మడత పెట్టేస్తూ ఉంటారు. అర్ధరాత్రి నుంచే కేక్ కటింగ్ లు ..భారీ భారీ కటౌట్లతో ఫ్లెక్సీలతో రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు . కాగా తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దళపతికి సైతం అదే విధమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .

కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ పేరు చెప్తే చొక్కాలు చించేసుకుని అరిచేసే జనాలు ఎక్కువ మందే ఉంటారు . నేడు ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని సినిమా విషయాలను అదే విధంగా ఆయన పర్సనల్ విషయాలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ఇదే క్రమంలో విజయ్ దళపతికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ది మోస్ట్ ఫేవరెట్ హీరో ఎవరు అనేది బాగా ట్రెండ్ అవుతుంది. వైరల్ గా కూడా మారింది. విజయ్ దళపతికి తెలుగులో కూడా మార్కెట్ ఉంది .

తెలుగు జనాలు కూడా ఆయనను అభిమానిస్తూ ఉంటారు ..ఆరాధిస్తూ ఉంటారు . కాగా విజయ్ దళపతి కి మొదటి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటన అన్న డెడికేషన్ అన్న వర్క్ చేసే విధానం అన్న చాలా చాలా నచ్చుతుంది. కేవలం రాజకీయాల పరంగానే కాదు పవన్ కళ్యాణ్ను స్వతహాగా ఒక రోల్ మోడల్ గా తీసుకున్నాడు విజయ్ దళపతి . ఈ విషయాన్ని స్వయాన ఆయనే పలు ఇంటర్వ్యూలో చెప్పుకోరావడం గమనార్హం. ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు పవన్ విజయ్ దళపతి అభిమానులు..!