ఇటీవల కాలంలో మన టాలీవుడ్ డైరెక్టర్స్ పాన్ ఇండియాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తమ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని రెట్టింపు చేస్తున్న వారిలో డైరెక్టర్ సుకుమార్ కూడా ఒకరు. మొదట పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో భారీ పాపులారిటి దక్కించుకున్న సుకుమార్ ప్రస్తుతం పుష్ప కు సీక్వెల్‌గా అల్లు అర్జున్‌తో పుష్ప 2 సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ కానుంది. అయితే సుకుమార్ ఈ సినిమా తర్వాత రామ్ చరణ్‌తో మరో సినిమా చేయబోతున్నాడు.
ఆ మూవీ రంగస్థలం సీక్వెల్ గా ఉండబోతుందంటూ వార్తలు వినిపించాయి. అయితే రామ్ చరణ్ తర్వాత సుకుమార్ మరో క్రేజీ హీరోతో మూవీకి కమిట్ అయ్యాడు అంటూ ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ హీరో మరెవరో కాదు కల్కి సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ప్రభాస్. సుకూ డైరెక్షన్‌లో ఓ లవ్ స్టోరీ సినిమాలో నటించబోతున్నాడట. కల్కి సినిమా చూసి ఇంప్రెస్ అయిపోయిన సుకుమార్ స్వయంగా డార్లింగ్‌కు ఫోన్ చేసి మరి స్పెషల్ విషెస్ తెలియజేసినట్లు.. అలాగే ఈ ప్రాజెక్టు గురించి వివరించినట్లు తెలుస్తోంది.
తర్వాత ప్రభాస్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథను విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రజెంట్ ఈ న్యూస్ నెటింట వైరల్‌గా మారింది. ఇక పుష్ప 2 సక్సెస్ సాధిస్తే సుకుమార్ ప్రభాస్ కాంబోలో సినిమాపై ప్రేక్షకుల్లో వేరే లెవెల్ లో అంచనాలు ఉంటాయు అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే వీరిద్దరి క్రేజీ కాంబోలో సినిమా వస్తే నిజంగానే బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ ఇరువురి అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.