ఛీ..ఛీ..ఆ పాత్రలో సాయి పల్లవి నా..? అస్సలు బుద్దుందా..? సునీల్ షాకింగ్ కామెంట్స్..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్ సాయి పల్లవి పై నెగిటివ్ కామెంట్స్ చేసే యాక్టర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆమె ఏ ముహూర్తన బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కానీ అప్పటి నుంచి అక్కడ సాయి పల్లవిను తొక్కేసే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి అన్న కామెంట్స్ ఫాన్స్ ఎక్కువగా చేస్తున్నారు . రన్బీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా రామాయణం సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమా సగం షూటింగ్ కంప్లీట్ అయిపోయింది . ఇప్పటికే రన్బీర్ రాముడు సీతగా సాయి పల్లవి పిక్స్ కూడా లీక్ అయ్యాయి.

అయితే ఈ లుక్స్ లో వాళ్ళు చాలా చాలా బాగున్నారు అంటూ బాలీవుడ్ బడాబడా ప్రముఖులు కూడా పొగిడేస్తారు . తాజాగా బాలీవుడ్ నటుడు సునీల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుల్లితెర రామాయణంలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సునీల్ ..సీతగా సాయి పల్లవి అస్సలు సెట్ అవ్వదు అని తేల్చి పడేసాడు . ఆయన మాట్లాడుతూ ..”సాయి పల్లవి నటన గురించి నాకు తెలియదు ఆమె నటించిన సినిమాలు నేను ఒక్కటి కూడా చూడలేదు.. అయితే సాయి పల్లవి లుక్స్ సీత లుక్స్ కి మ్యాచ్ అవ్వవు.. సీత లుక్స్ చాలా ట్రెడిషనల్ గా ఉండాలి. ఆమె ఫేస్ కట్ లో నాకు ఎక్కడ అలా కనిపించలేదు .. ఇక రన్బీర్ కపూర్ విషయానికొస్తే అనిమల్ సినిమాలో రన్బీర్ పర్ఫామెన్స్ చూసిన తర్వాత ఎవ్వరైనా రాముడి పాత్రలో రణబీర్ ని ఊహించుకుంటారా..?”

” అస్సలకి వీళ్ళిద్దరూ ఆ పాత్రలకు సూట్ కారు అంటూ తేల్చి చెప్పేసాడు”. ఆయన మాటలు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి . అయితే చాలామంది సునీల్ మాటలను తప్పుపడుతున్నారు . లుక్స్ పరంగా వాళ్ళిద్దరికీ బాగా సెట్ అయింది అని కచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అందుకుంటుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!