“ఆ ఒక్క పదంతో కల్కి సినిమాపై ట్రిపుల్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన రాజమౌళి”.. నా స్వామి రంగా ఇక అరుపులే అరుపులు..!

ఇన్నాళ్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . దర్శకధీరుడు రాజమౌళి ప్రభాస్ ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు అని.. ప్రభాస్ తో హిట్ అందుకున్న రాజమౌళి .. మరి ఏ డైరెక్టర్ ఆయనతో సినిమా తెరకెక్కించి హిట్ కొడితే చూడలేడు అని.. ఆ కారణంగానే కల్కి ప్రమోషన్స్ ఈవెంట్లో పాల్గొనలేదు అని ..కల్కి సినిమాకి ఏ విధంగా సపోర్ట్ చేయలేదు అని తెగ రాద్ధాంతం జరిగింది . అయితే అవంతా పుకార్లు అంటూ కొట్టి పడేసే రేంజ్ లో ఒకే ఒక్క ట్వీట్ తో ఫుల్ ఫుల్ గా కల్కి సినిమాపై హైప్ పెంచేసాడు రాజమౌళి .

రీసెంట్గా కల్కి సినిమాకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ మొదటి ట్రైలర్ కన్నా బాగా అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఈ ట్రైలర్ చూసిన రాజమౌళి చాలా చాలా బాగా నాగ్ అశ్వీన్ ని ఓ రేంజ్ లో పొగిడేసాడు . డార్లింగ్ అంటూ ప్రభాస్ని సైతం ప్రశంసించాడు. దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

రాజమౌళి ట్వీట్ చేస్తూ..” పవర్ ప్యాక్డ్ ట్రైలర్ ఇది అమితాబ్ జీ.. డార్లింగ్.. దీపికా పాత్రలు చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి.. డెప్త్ కలిగి ఉండడంతో ఇంట్రెస్టింగ్ గా మారాయి ..చాలా చాలా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.. కమల్ సార్ లుక్స్ చూసి నేను ఫిదా అయిపోయాను .. ఎప్పటిలాగే వెండితెరపై ఆయన ఆశ్చర్యపరచడానికి రెడీ అయ్యారు. నాగి ..27వ తేదీ కోసం మేము ఆత్రుతగా వెయిట్ చేస్తున్నాము” అంటూ ట్విట్ చేశారు . దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా కల్కి హ్య్స్ష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి . పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి ట్వీట్ చేయడంతో ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో కల్కి సినిమా పేరు మారుమ్రోగిపోతుంది..!